Nalgonda : నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం..!
Nalgonda : నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి విజయం..!
నల్లగొండ , మన సాక్షి :
నల్లగొండ,, వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండో ప్రాధాన్యత ఓట్లతో పిఆర్టీయుకు చెందిన పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. గెలుపుకు అవసరమైన 13,969 ఓట్లను ఆయన రెండో ప్రాధాన్యతలో సాధించారు.
మొదటి ప్రాధాన్యతలో ఆయనకు 6074, యుటిఎఫ్ నర్సిరెడ్డికి 4820 హర్షవర్ధన్ రెడ్డికి 4437 పూల రవీందర్ కు 3115 పులి సర్వోత్తమ్ రెడ్డికి 2289 ఓట్లు రాగా ఎవరికి మొదటి ప్రాధాన్యతలో పూర్తి మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యతను లెక్కించారు. రెండో ప్రాధాన్యతలో హోరా హోరిగా సాగిన పోరులో శ్రీపాల్ రెడ్డి మ్యాజిక్ ఫిగర్ దాటి విజయం సాధించారు.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంగా మొత్తం 19 మంది అభ్యర్థుల గాను ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ ఆఖరికి శ్రీపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నర్సిరెడ్డిలు మిగలగా ఇందులో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా శ్రీపాల్ రెడ్డి విజయ సాధించారు. కాగా శ్రీపాల్ రెడ్డి విజయం పట్ల పి ఆర్ టీ యు శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
MOST READ :
-
MLC Counting : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రిజల్ట్.. ముందంజలో పింగిలి.. ఎన్ని ఓట్లంటే..!
-
CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. నేతల్లో టెన్షన్..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!









