BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
మన సాక్షి,
తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయి వార్తలకు ప్రాధాన్యతనిస్తూ బ్రేకింగ్ న్యూస్..
ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం:
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్. అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీన పార్టీ రజితోత్సవాల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు.
————–
రైతుల ఆందోళన :
సిద్దిపేట – కామారెడ్డి రహదారిపై రైతుల ఆందోళన. సాగునీటిని అందజేయాలని రైతులు ఆందోళన చేశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
————–
ఏపీ క్యాబినెట్ సమావేశం :
ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది. సమావేశంలో 14 అంశాలకు సంబంధించిన విషయాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ కానున్నది. సమావేశంలో అమరావతి పనులపై చర్చించనున్నారు.
———
రేపు పరేడ్ గ్రామంలో భారీ బహిరంగ సభ :
ఇందిరా మహిళా శక్తి పేరుతో రేపు మహిళా దినోత్సవ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. హైదరాబాదులోని పర్యట గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు సాయంత్రం సభ నిర్వహించనున్నారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల కేటాయింపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
——
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జేఏసీ :
నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేద్దామని తమిళనాడు సీఎం స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాల నేతలకు లేఖలు రాశారు. దాంతో పాటు ఉత్తరాదిలో బిజెపి వ్యతిరేక సీఎంలకు కూడా లేఖలు రాశారు. దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలకు రాసిన ఈ లేఖలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధ్యక్షులు జగన్ ఉన్నారు. ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్ లోని పార్టీలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు కూడా ఆహ్వాన లేఖలు పంపారు.
MOST READ :
-
TG News : తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్.. ఉద్యోగ సంఘాలు హ్యాపీ..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
-
Ration Cards : రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్..!
-
Free Sewing Machine : మహిళలకు సూపర్ గుడ్ న్యూస్.. ఉచిత కుట్టుమిషన్లకు దరఖాస్తు ఇలా..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో రూ.1లక్ష.. లేటెస్ట్ అప్డేట్..!









