Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పన్ను బకాయి చెల్లించకుంటే షాపింగ్ మాల్స్ సీజ్..!

District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పన్ను బకాయి చెల్లించకుంటే షాపింగ్ మాల్స్ సీజ్..!

జగిత్యాల, మన సాక్షి :

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల , మెట్ పల్లి పట్టణంలో మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు పూర్తి చేసేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గురువారం రోజున కోరుట్ల, మెట్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్నుల వసూలు, ఎల్ఆర్ఎస్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

కోరుట్ల పట్టణంలో అత్యధికంగా ఇంటి పన్ను బకాయిలు ఉన్న షాపింగ్ మాల్ లను సందర్శించి, రెండు రోజులలో బకాయిలు కట్టకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్  హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు కోరుట్ల పట్టణంలో 80 శాతం ఇంటి పన్ను వసూలు అయింది.

ఈనెల 31 వరకు ఉన్న గడువులో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. గడువు లోపల అందరూ ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలి, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. ఈనెల 31 వరకు 25 శాతం రాయితీ ఉపయోగించుకొని అందరూ ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవాలి, ఎవరైతే రెగ్యులర్ చేసుకుంటారో వారికి వెంటనే సర్టిఫికెట్స్ జారీ చేయడం జరుగుతుంది అన్నారు.

కోరుట్ల పట్టణంలో 46 మంది ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం ఆమోదించడం జరిగిందని, మిగతా వారిని కూడా ఫాలో అప్ చేస్తూ మార్చి 31 లోగా ఫీజు చెల్లించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. పట్టణ అభివృద్ధి ప్రజల సహకారంతోనే సాధ్యమని, అందరూ తమ ఆస్తి పన్నులను  ఇతర మున్సిపల్ పన్నులను సకాలంలో చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

100% పన్ను వసూలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులకు సూచించారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని అర్బన్ ప్రైమరీ యూపీహెచ్ఎస్సి హెల్త్ సబ్ సెంటర్ పనులను అధికారులతో కలిసి పరిశీలించి, నిర్మాణ పనులను త్వరిగతన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

మెట్ పల్లి పట్టణ శివారులో నూతనంగా నిర్మించనున్న హెల్త్ సబ్ సెంటర్ స్థలం సేకరణ పనులను ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ప్రజలకు అనుగుణంగా ఉండే స్థలం లో నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట, ఆర్డీవోలు, జివాకర్ రెడ్డి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్లు, రామకృష్ణ మోహన్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  3. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వారి డిప్యూటేషన్లన్నీ రద్దు..! 

  4. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

మరిన్ని వార్తలు