Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

TG News : ఆరోగ్యశ్రీ నిబంధనల్లో మార్పు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ఆరోగ్యశ్రీ సేవలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. అందుకుగాను ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పథకాన్ని గతంలో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

గత ప్రభుత్వ హాయంలో ఆరోగ్యశ్రీకి పరిమితులు విధించింది. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కి పరిమితులు కూడా పెంచారు. అదేవిధంగా ప్రస్తుతం కీలక మార్పులు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది చిన్నపిల్లలు వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారికి వినికిడి సమస్య నుంచి ఉపశమనం కల్పించేందుకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కి వయస్సు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. గతంలో ఆరోగ్యశ్రీ కింద పిల్లలకు మూడేళ్ల వయసు వరకే ఈ శస్త్ర చికిత్సలు చేయించుకునేది. కానీ ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో కర్నన్ సర్కులర్ జారీ చేశారు.

ఈ సర్జరీ వల్ల పూర్తిగా సమస్య తొలగక పోవచ్చు కానీ కొంతవరకు మాత్రం ఉపశమనం కలుగుతుంది. ఈ సర్జరీకి ప్రైవేట్ ఆస్పత్రులలో అయితే సగటున ఆరు లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇప్పటివరకు కోఠి ఈ ఎన్ టి, గాంధీ ఆసుపత్రి, వరంగల్ ఎంజిఎం ఆసుపత్రుల్లో మాత్రమే ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు.

వాటిలో కూడా 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం మూడు ఆసుపత్రులలో 132 ఆపరేషన్ మాత్రమే చేశారు. అయితే ఇకపై మరిన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఈ ఆపరేషన్ల చేసే అవకాశంను ప్రభుత్వం కల్పించనున్నది.

MOST READ : 

  1. TG News : తెలంగాణలో వారికి గ్రీన్ కార్డులు.. బిగ్ అప్డేట్..!

  2. District collector : పేద విద్యార్థినికి జిల్లా కలెక్టర్ బాసట..! 

  3. UPI : గూగుల్ పే, ఫోన్ పే బిగ్ షాక్.. లావాదేవీలు ఇక పిరం..!

  4. Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!

  5. Groups : డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎంపికైన పంచాయతీ కార్యదర్శి..!

మరిన్ని వార్తలు