తెలంగాణBreaking Newsవ్యవసాయం

Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మహిళా రైతులకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ తెలియజేసింది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం లో భాగంగా మహిళలకు 50 శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందించనున్నారు.

వ్యవసాయ యాంత్రీకరణలో బ్యాటరీ స్రేయర్లు, తైవాన్లు, డ్రోన్, రోటోమీటర్లు, విత్తనములు, ఎరువులు వేసే యంత్రాలు, కల్టివేటర్, కేజీ వీల్, బండ్ ఫార్మర్, పవర్ వీడర్, బుష్ కట్టర్లు, పవర్ టిట్లర్లు, ట్రాక్టర్లు, మెజ్ షెల్టర్లు, ఎంబి ప్లన్, వరిగడ్డి కట్టలు కట్టే యంత్రాలు రాయితీపై అందజేయనున్నారు.

అయితే మహిళలకు 50% రాయితీ ఇస్తున్నందున భూమి పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ట్రాక్టర్ (ఆర్ సి ట్రాక్టర్ కు సంబంధించిన పరికరాలకు మాత్రమే) మహిళ పేరుతో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల వ్యవసాయ అధికారి కార్యాలయాలతో పాటు క్లస్టర్ ఏఈఓ ల వద్ద దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. అర్హులైన వారందరికీ రాయితీపై వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం అందజేయనున్నది.

MOST READ : 

  1. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. యూపీఐ లావాదేవీలకు కేంద్రం గుడ్ న్యూస్..!

  3. WhatsApp : మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్.. ఎలా చేస్తారంటే.. బిగ్ అలర్ట్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై భారీ గుడ్ న్యూస్.. నిధుల కేటాయింపు..!

  5. Brothers : ఈ అన్నదమ్ములకు పేదరికమే తలవంచింది..!

మరిన్ని వార్తలు