TOP STORIESBreaking Newsవ్యవసాయం

TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

TG News : రైతులకు భారీ షాక్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు. విడుతల వారీగా నిధులు విడుదల చేస్తూ రెండు లక్షల రూపాయల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేశారు.

రెండు లక్షల రూపాయలకు పైగా రుణాలు ఉన్న రైతులకు కూడా ఆపైన రుణం చెల్లిస్తే రెండు లక్షల వరకు మాఫీ చేస్తామని అప్పట్లో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం విధితమే. దాంతో నేటి వరకు కూడా రైతులు రుణమాఫీ అవుతుందని రెండు లక్షల రూపాయలకు పైగా ఋణం తీసుకున్న రైతులు ఎదురు చూశారు. కానీ శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రుణమాఫీ పై స్పష్టత ఇచ్చారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. దాంతో రెండు లక్షల పైగా రుణాలు ఉన్న రైతులవి మాఫీ లేదని తేలింది. రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులు తెలంగాణలో సుమారుగా 25 లక్షల మంది ఉన్నట్లు సమాచారం.

MOST READ : 

మరిన్ని వార్తలు