తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లావ్యవసాయం

Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!

Rythu award : రైతుకు జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు.. అభినందించిన అదనపు కలెక్టర్ వేణు..!

పెద్దపల్లి, ధర్మారం :మన సాక్షి :

పెద్దపల్లి జిల్లాకు చెందిన రైతు మల్లారెడ్డికి జాతీయస్థాయి ఆవిష్కర్త అవార్డు లభించింది. జాతీయస్థాయి అవార్డు అందుకున్న రైతును జిల్లా అదనపు కలెక్టర్ అభినందించారు.

ఆవిష్కర్తగా జాతీయస్థాయి సంస్థ నుంచి అవార్డు పొందిన రైతు మల్లారెడ్డి ను అదనపు కలెక్టర్ డి.వేణు అభినందించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రైతు ఆవిష్కరిత ఎర్రం మల్లారెడ్డిని కలిశారు.

పెద్దపల్లి మండలం కాసులపల్లి గ్రామానికి చెందిన ఎర్రం మల్లారెడ్డి డ్రం సీడర్ పద్ధతితో విత్తనాలు జల్లడం, ఇతర ఆధునిక పద్ధతులను పాటించి అత్యధికంగా వారి దిగుబడులు సాధించిన నేపథ్యంలో న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థ ఇన్నోవేటర్ ఫార్మర్ గా ఎంపిక చేసి అవార్డు అందించడం జరిగింది.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంబంధిత రైతును అభినందించి, ఆధునిక పద్ధతులను ఇతర రైతుల కూడా పాటించి అధిక దిగబడులు సాధించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత రైతు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా, ఆత్మీయ భరోసా అకౌంట్లోకి డబ్బులు ఎప్పుడంటే.. బిగ్ అప్డేట్..!

  2. TG News : నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..!

  3. Mahila Rythu : మహిళా రైతులకు తెలంగాణ ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. వారికి 50% రాయితీ..!

  4. Rythu : తెలంగాణలో రైతులకు భారీ గుడ్ న్యూస్.. సబ్సిడీ కోసం దరఖాస్తుల ఆహ్వానం..! 

  5. WhatsApp : వాట్సప్ హ్యాకర్ల నుంచి రక్షించుకోవడం ఎలా..!

మరిన్ని వార్తలు