తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండ

Komatireddy Venkatreddy : సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పూర్తికి గడువు.. ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Komatireddy Venkatreddy : సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పూర్తికి గడువు.. ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

నల్లగొండ, మన సాక్షి :

నల్గొండ సమీపంలోని శేషమ్మ గూడెం వద్ద చేపట్టిన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను ఏప్రిల్ 25 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, నల్గొండ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ జె. శ్రీనివాస్ , ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటును తనిఖీ చేశారు.2014 లో 38 కోట్ల రూపాయలతో ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మంజూరు అయిందని, ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడం బాధాకరమని అన్నారు.

నల్గొండ పట్టణంలో దాదాపు 80 శాతం ఇండ్లు ఎస్టిపి కనెక్షన్లు కలిగి ఉన్నాయని, ముఖ్యంగా వెంకటేశ్వర కాలనీ, రాఘవేంద్ర కాలనీ లాంటి అన్ని కాలనీలకు ఎస్టీపి కనెక్షన్ ఉందని, తక్కిన ఇండ్లకు కూడా ఎస్టీపీ కనెక్షన్లు ఇస్తామని, అందువలన రానున్న 25, 30 రోజుల్లో ఎస్ టి పి నిర్మాణం పూర్తిచేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పూర్తి చేయడంతో పాటు, చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటించాలని, టైల్స్, పెయింటింగ్ వంటి వాటన్నింటినీ ఏర్పాటు చేయాలని చెప్పారు.

నర్సప్పగూడ వద్ద ఇంకా అదునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మరో ఎస్టిపి నిర్మాణాన్ని చేపట్టనున్నామని, ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లాలో ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులను తాము చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఎస్ టి పి నిర్మాణంలో జిల్లా కలెక్టర్ తో పాటు, ప్రత్యేక అధికారి చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిర్మాణాన్ని త్వరితగతన పూర్తి చేయాల్సిందిగా పునరుద్ఘాటించారు.

నల్గొండ పట్టణ కేంద్రం నడిబొడ్డున ఉన్న ఎన్జీ కళాశాల మైదానంలో హరితహారం మొక్కలు నాటించాలని, గార్డెన్ ఏర్పాటు చేయాలని, కళాశాల మైదానంలోఎవరు చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా చెత్త వేస్తే జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఫ్లైఓవర్లకు పెయింటింగ్ వేయించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.

అనంతరం మంత్రి ఛాయా సోమేశ్వర దేవాలయం వెనక వైపు ఉన్న డై సింగ్ కుంట రోడ్డును, అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే వాహనాల పార్కింగ్ అభివృద్ధి కై స్థలాన్ని పరిశీలించారు.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్ పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, ఆర్డిఓ అశోక్ రెడ్డి ,పబ్లిక్ హెల్త్,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ అధికారులు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

MOST READ :

  1. Hyderabad : బీటెక్ పరీక్ష ఫలితాలు విడుదల..!

  2. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  3. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

  4. Ration Cards : పేదలకు శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు ఎప్పటినుంచంటే.. వారికి కూడా సన్న బియ్యం..!

  5. Mutual Funds : మహిళల ఘనత.. ప్రతి నలుగురిలో ముగ్గురు వారే..!

మరిన్ని వార్తలు