Toll Tax : టోల్ టాక్స్ తగ్గిందోచ్.. వాహనదారులకు భారీ ఊరట..!
Toll Tax : టోల్ టాక్స్ తగ్గిందోచ్.. వాహనదారులకు భారీ ఊరట..!
మన సాక్షి, హైదరాబాద్ :
వాహనదారులకు భారీ శుభవార్త ఎన్ హెచ్ ఎ ఐ తెలియజేసింది. వాహనదారులకు భారీ ఊరటగా చెప్పవచ్చును. విజయవాడ – హైదరాబాద్ హైవే మార్గంలో టోల్ ట్యాక్స్ ను భారీగా తగ్గించింది.
సాధారణ సమయాల్లోనే భారీగా టాక్స్ ఉండడంతో పాటు పండగ సమయాల్లో మరింతగా పెంచేవారు. టోల్ టాక్స్ అదనపు భారం వల్ల కొంతమంది ప్రయాణాలు కూడా వాయిదా వేసుకునేవారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టోల్ ట్యాక్స్ లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా రెండు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి భారీ ఊరట కలిగింది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (NH 65) పై ప్రయాణించే వాహనదారులకు ఎన్ హెచ్ ఏ ఐ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గిన టోల్ టాక్స్ ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నది.
హైదరాబాద్ – విజయవాడ రహదారిపై తెలంగాణలో పంతంగి కొర్లపహాడ్, ఆంధ్ర ప్రదేశ్ లోని నందిగామ సమీపంలో ఉన్న చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద ట్యాక్స్ లు వసూలు చేస్తున్నాయి. వాటిల్లో అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీపులు, వ్యాన్లు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు, తేలికపాటి ట్రాన్స్ పోర్ట్ వాహనాలకైతే ఒకవైపు ప్రయాణానికి 25 రూపాయలు, ఇరువైపులా ప్రయాణానికి 40 రూపాయలు, బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50 రూపాయలు, ఇరువైపులా ప్రయాణానికి 75 రూపాయలను తగ్గించినట్లు ఎన్ హెచ్ ఏ ఐ పేర్కొన్నది.
ఆంధ్రప్రదేశ్ లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వాహనాలకు ఒకవైపు ఐదు రూపాయలు, ఇరువైపులా 10 రూపాయల చొప్పున తగ్గించారు. దాంతో పాటు 24 గంటల్లోపు తిరుగు ప్రయాణం చేసే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు లభిస్తుందని ఎన్ హెచ్ ఎ ఐ ప్రకటించింది. ఈ తగ్గిన టాక్స్ 2026 మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయి.
MOST READ ;
-
CM Revanth Reddy : చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!
-
Hyderabad : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!
-
Miryalaguda : హుజూర్‌నగర్ సభలో మిర్యాలగూడకు గిఫ్ట్..!
-
Ration Cards : ట్రై కలర్స్ లో రేషన్ కార్డులు.. రేపటి నుంచి సన్న బియ్యం పంపిణీ..!
-
WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!









