TSPSC : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసింది.. గ్రూప్ 1,2,3 తో పాటు మరో ఉద్యోగం ఆమె సొంతం..!
TSPSC : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసింది.. గ్రూప్ 1,2,3 తో పాటు మరో ఉద్యోగం ఆమె సొంతం..!
నేలకొండపల్లి, మన సాక్షి:
సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసింది. అనుకున్న లక్ష్యం సాధించింది. వరుసగా నాలుగు కొలువులు కొట్టింది.ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని మండ్రాజుపల్లి గ్రామానికి చెందిన నెల్లూరి సింధు వరసగా నాలుగు ఉద్యోగ అవకాశాలు సాధించింది. తాజాగా గ్రూపు-1 లో మల్టీజోన్ లో మహిళా కోటా లో 64 వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 176 వ ర్యాంకు ను సాధించారు. ‘ గతంలో 2016 లోనే గ్రూపు-2 లో ఎంపీవో గా, గ్రూపు-3 లో సీనియర్ అకౌంటెంట్ కొలువులు సాధించింది.
ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్ వార్డు ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడారు. తాను గ్రూప్స్ రాయటం కోసం చేసే సాప్ట్వేర్ ఉద్యోగం వదిలేశాను. గ్రూప్స్ కోసం తాను నిరంతరం కష్టపడ్డానని అన్నారు. గ్రూప్స్ ప్రిపేర్ కోసం దాదాపు 15 గంటల పాటు శ్రమించాను. పరీక్షల సమయంలో కేవలం మూడు గంటల మాత్రమే నిద్రపోయానని పేర్కోన్నారు. అనుకున్న లక్ష్యం ను సాధించానన్నారు. అందుకు తన భర్త, కుటుంబ సభ్యుల సహాకారం మరవలేనిది అన్నారు.
MOST READ :
-
TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!
-
Holiday : మరో రోజు సెలవు పొడిగింపు..!
-
TG News : తెలంగాణలో మరో దారుణం.. వివాహితపై సామూహిక అత్యాచారం..!
-
CM Revanth Reddy : ఇది మామూలు పథకం కాదు.. దీనిని రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయలేడు..!
-
TG News : సర్పంచ్ ఎన్నికల డేట్ ఫిక్స్.. షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కార్..!









