గజ్జలవారి పల్లెలో వైభవంగా దిగువ బండెమ్మ అమ్మవారి రథోత్సవం..!
గజ్జలవారి పల్లెలో వైభవంగా దిగువ బండెమ్మ అమ్మవారి రథోత్సవం..!
రామసముద్రం, మనసాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కాప్పల్లె పంచాయతీ గజ్జలవారి పల్లె గ్రామం లో వెలిసిన దిగువ బండేమ్మ అమ్మవారి రథోత్సవ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని పలు రకాల పుష్పలతో అలంకరణ చేసి రథంలో ఉంచి పురవీదుల్లో ఊరేగింపు జరిగింది.
రథం లాగడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.భక్తులు అమ్మ వారికి మంగళహారతులు పట్టి కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. రథోత్సవం తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కోవా కృష్ణమూర్థి వారి కుటుంబ సభ్యులు రథోత్సవం ను తిలకించడానికి వచ్చిన భక్తులకు మజ్జిగ, ప్రసాదాలు అందజేశారు.
ఈకార్యక్రమంలో బండెమ్మ ఆలయ పూజారి కార్యానిర్వాహుకులు అశేష భక్తజనం పాల్గొన్నారు.గజ్జల వారిపల్లె వాస్తవ్యులు కోవా కృష్ణకుమార్ మాట్లాడుతూ బండెమ్మ అమ్మవారి దీవెనలు ఆశీస్సులు అందరూ పొందాలని కోవాకృష్ణ అన్నారు. అమ్మవారిని దర్శించు కుని ఏ కోరిక కోరిన తప్పకుండా నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు.
MOST READ :









