Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం

Leopard : చిరుత పులి మృతి కేసు కలకలం.. ఫారెస్ట్ కార్యాలయం ముట్టడించిన మహిళా రైతులు..!

Leopard : చిరుత పులి మృతి కేసు కలకలం.. ఫారెస్ట్ కార్యాలయం ముట్టడించిన మహిళా రైతులు..!

మదనపల్లి, మన సాక్షి :

మదనపల్లి రూరల్ మండలం, పొన్నూటిపాలెం గ్రామ సమీపంలోని పొలాల వద్ద చిక్కుకున్న చిరుత పులి మృతి కేసు అంతటా కలకలాన్ని రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గర్భంలో రెండు పిల్లలతో వున్న ఆడ చిరుత పులి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మృతి చెందిందని అంతటా విమర్శలు వెళ్లు వెతుతున్నాయి. మదనపల్లిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి ఫారెస్ట్ అధికారులు రైతులపై బలవంతంగా కేసులు పెట్టి రిమాండ్ కు తరలించాలని చేస్తున్న ప్రయత్నం పై మండిపడుతున్నారు. రైతులపై కేసు పెట్టడం ఏమిటని   తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వ తీరు ఇదేనా అని ఎండ గడుతున్నారు. ఉరికి చిక్కి నరకయాతన అనుభవించిన చిరుతను రక్షించడంలో ఫారెస్ట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిరుతను కాపాడటానికి ఎలాంటి చిన్నపాటి చర్యలు కూడా తీసుకోలేదు. పైగా కాలయాపన చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పొన్నూటిపాలెంకు చెందిన రెడ్డెప్ప రెడ్డి, రమణారెడ్డి, గంగాద్రిపై ఫారెస్టు అధికారులు కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరు కుర్చుంటే లెయ్యలేరు.. లేస్తే కుర్చోలేడు. మరొకరు వృద్దుడు. ఇంకొకరు కూలీపనులు చేసుకునే వారు. ఇలాంటి వారిపై కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని పరిసర గ్రామాల వారు కూడా చెబుతున్నారు.

దీంతో అధికారులు రైతులపై పెట్టిన కేసుకు నిరసనగా మదనపల్లె ఫారెస్టు కార్యాలయం వద్ద శుక్రవారం బాధిత రైతు కుటుంబానికి చెందిన శ్రావణి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, రైతులు ధర్నా నిర్వహించారు.

ఫారెస్టు అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు. కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఏ ఆధారాలను బట్టి రైతులపై కేసు నమోదు చేస్తారని మహిళా రైతు శ్రావణి నిలదీశారు. తనమామను వదిలిపెట్టకపోతే పురుగుల మందు తీసుకుని ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. రైతులపై కేసు నమోదు చేయడానికి అధికారులకు మనసెలా వచ్చిందని మండిపడ్డారు.

ఇలాంటి అవమానాలు తట్టుకోలేకనే రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. నిస్కారణంగా చేయని తప్పుకు రైతులను చిరుత కేసులో ఇరికిస్తే సహించేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మహిళా రైతు శ్రావణి తదితరులు అధికారుల తీరుపై మండిపడ్డారు.

అధికారుల తీరుకు నిరసనగా మహిళా రైతులు చేపట్టిన ఆందోళన కలకలాన్ని రేపింది. చివరకు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చిరుత కేసులో రైతులను ఇరికించడంపై డిప్యూటీ సీఎం, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విచారణ అధికారిగా పిసిసి ఎఫ్ చలపతిరావును నియమించారు.

ఆయన జిల్లా ఫారెస్ట్ అధికారులతో కలిసి చిరుత పులి చనిపోయిన ప్రాంతంలో పర్యటించారు. అక్కడి రైతులు, గ్రామస్తులతో విచారణ అధికారి మాట్లాడారు. చిరుత పులి మృతి విషయంలో తమ పాత్ర ఏమాత్రం లేదని, వలలో చిక్కుకున్న చిరుత పులి గురించి ఫారెస్ట్ అధికారులకు ఉదయం 7 గంటలకే సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అయితే ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి ఆలస్యంగా రావడం, చిక్కుకున్న పులిని కాపాడే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆకలితో అలమటించి మృతి చెందినట్లు వెల్లడించారు. సకాలంలో ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ పులికి ఆహారం అందించడం, లేకపోతే మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాపాడి ఉంటే బతికి ఉండేదని విచారణ అధికారి ముందు తెలియజేశారు.

ఆ తర్వాత చలపతిరావు మదనపల్లి ఫారెస్ట్ కార్యాలయంకు చేరుకొని స్థానిక ఫారెస్టు అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఫారెస్ట్ కార్యాలయం బయట వేచి ఉన్న పాత్రికేయులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విచారణ అధికారి వెళ్ళిపోయారు. దీంతో పాత్రికేయులు సైతం ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం చెందారు.

ఎమ్మెల్యే షాజహాన్ భాష రైతులకు న్యాయం చేయాలని వినతి.

పొన్నూటిపాలెం గ్రామం వ్యవసాయ పొలాల వద్ద మృతి చెందిన చిరుత పులి విషయంలో రైతులపై కేసులు లేకుండా న్యాయం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషకు విన్నవించారు. ఈ మేరకు పొన్నెటి పాలెం, రామిరెడ్డిగారిపల్లి, సవరంవారిపల్లి, పిచ్చిలోల్లపల్లి, కోళ్లబైలు గ్రామాలకు చెందిన రైతులు మదనపల్లి ఫారెస్ట్ కార్యాలయంకు చేరుకున్నారు.

రైతులపై పెట్టిన కేసులను ఫారెస్ట్ అధికారులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా రైతులపై అధికారులు కేసులు పెడతారు అన్న భయంతో ఊర్లు వదిలి వెళ్లిపోయారు. ఇందుకు రైతులకు న్యాయం చేయాలని స్థానికులు ఎమ్మెల్యేకు విన్నవించారు. రైతుల కేసుల విషయంలో పలు రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఫారెస్ట్ అధికారులపై విమర్శలు చేస్తున్నారు.

MOST READ :

మరిన్ని వార్తలు