TG News : ఆరు నెలలైనా సబ్జెక్ట్ లేదు.. వేదికపైనే ఆర్డిఓపై మంత్రి పొంగులేటి ఆగ్రహం..!
TG News : ఆరు నెలలైనా సబ్జెక్ట్ లేదు.. వేదికపైనే ఆర్డిఓపై మంత్రి పొంగులేటి ఆగ్రహం..!
దేవరకొండ, మనసాక్షి :
ఆరు నెలలైనా సబ్జెక్ట్ లేదు అంటూ వేదికపై నుంచే ఆర్డిఓపై మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చందంపేటలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో జరిగింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో సోమవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సు కార్యక్రమంలో దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి పై రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న పొగిల్లా, చిత్రియాల , చందంపేట, కాసురాజుపల్లి కంబాలపల్లి, ప్రజలు భూ సమస్యల కోసం చందంపేట ఎమ్మార్వో ఆఫీస్, ఆర్డిఓ ఆఫీస్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన కనీసం అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెప్పారు.
వెంటనే పక్కన ఉన్న ఆర్డీఓ ను ప్రజలను మీరు ఎందుకు తిప్పించుకుంటున్నారు.. అంటూ భూ సమస్యలు ఎలా పరిష్కరించాలో మీకు తెలవదా..? అంటూ కనీస సబ్జెక్టు లేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరకొండ కు ఆర్డిఓ గా వచ్చి 6 నెలలు అవుతున్న కనీస సబ్జెక్ట్ లేదు.. అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.
MOST READ :
-
Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!
-
Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!
-
Additional Collector : ధాన్యం తూకంలో తేడా వస్తే చర్యలు.. రైస్ మిల్లులు ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్..!
-
Walk in Interview : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూ..!









