క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

PDS : కారులో పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు..!

PDS : కారులో పీడీఎస్ సన్న బియ్యం అక్రమ రవాణా.. పట్టుకున్న పోలీసులు.. ముగ్గురిపై కేసు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కూడా పక్కదారి పడుతున్నాయి. బియ్యం దందా చేసేవారు కార్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ సంఘటన మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వెలుగు చూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లి గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మిర్యాలగూడ వైపు ఇండికా కారులో సన్న బియ్యం బస్తాల ముఠాలు ఉన్నాయి. పోలీసులను చూసి కారు డ్రైవర్ వేగం పెంచి పారిపోతుండగా పట్టుకున్నారు. మూడు క్వింటాళ్ల పీడీ ఎస్ రేషన్ బియ్యం కారులో ఉన్నాయి.

కాగా కారు డ్రైవర్ కొండేటి అశోక్, కారు ఓనర్ సైదమ్మ, బస్తాలు మాయడానికి వెళ్లిన వ్యక్తి కుంచాల రాజు పై కేసు నమోదు చేశారు. వీరు ఉట్లపల్లి గ్రామంతో పాటు పలుచోట్ల పది రూపాయలకు కిలో చొప్పున బియ్యం కొనుగోలు చేసి మిర్యాలగూడలో గుర్తుతెలియని వ్యక్తులకు 15 రూపాయలకు అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కారును సీజ్ చేసినట్లు తెలిపారు.

MOST READ : 

  1. Miryalaguda : ఇంటర్ ఫలితాల్లో సెయింట్ జాన్స్ విద్యార్థుల ప్రభంజనం..!

  2. Viral Video : టీచర్ ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్.. (వైరల్ వీడియో)

  3. District collector : భూ భారతి తో రైతులందరికి వన్ బి.. కలెక్టర్ వెల్లడి..!

  4. Gold Price : గోల్డ్.. సరికొత్త రికార్డు.. తులం లక్ష దాటింది..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు