Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణహైదరాబాద్

TG News : తెలంగాణకు చల్లని కబురు.. మొదలైన చల్లటి గాలులు.. జిల్లాలకు అలర్ట్..!

TG News : తెలంగాణకు చల్లని కబురు.. మొదలైన చల్లటి గాలులు.. జిల్లాలకు అలర్ట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్రానికి చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోని కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలలో శనివారం నుండి వర్షాలు ప్రారంభం కానున్నాయి. శనివారం పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హైచ్చరించింది.

దాంతోపాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని తెలియజేసింది. హైదరాబాద్ నగరం తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం మధ్యాహ్నం వరకు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన జిల్లాల్లో కూడా ఒకసారిగా వాతావరణం చల్లబడింది. ఈనెల 26వ తేదీ నుంచి మొదలయ్య వర్షాలు 30వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది.

జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. బయటకు వెళ్లే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

అదేవిధంగా ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో వర్షంతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది.

MOST READ :

  1. Big Alert : ఈ పేరుతో ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు వస్తే జాగ్రత్త.. లేదంటే మీ ఖాతా ఖాళీ..!

  2. Video call : రిటైర్డ్ ఉద్యోగినికి వీడియో కాల్.. రూ. 30 లక్షలు కొట్టేశారు..!

  3. KSRTC : చీ.. చీ.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్.. (వీడియో వైరల్)

  4. District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!

  5. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!

మరిన్ని వార్తలు