ఆంధ్రప్రదేశ్Breaking Newsవ్యవసాయం

Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!

Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!

మనసాక్షి, అమరావతి :

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వారి గుడ్ న్యూస్ తెలియజేసింది. మంగళవారం సాయంత్రంలోగా రైతుల బ్యాక్ ఖాతాలో నగదు జామ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతుల పంటలు దెబ్బతిన్నాయి.

కాగా ఈ నేపథ్యంలో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం ఆదుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయాలని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా మంగళవారం సాయంత్రంలోగా బాధిత రైతులకు బ్యాంకు ఖాతాలో నగదు జమ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,224 హెక్టార్లలో మొక్కజొన్న, వరి పంటలు, 138 హెక్టార్లలో అరటి, మామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. కాగా నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం వేగంగా స్పందించింది.

అదే విధంగా వర్షాల సమయంలో పిడుగులు పడి మృతి చెందిన 10మంది కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అందజేయనున్నది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల బాధిత కుటుంబాలకు, పంటలు దెబ్బతిన్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా కల్పించింది.

MOST READ : 

  1. Gold Price : పసిడి ప్రియులకు ఊహించని షాక్.. ఒక్కరోజే రూ. 27,300..!

  2. Mango: కల్తీ మామిడిపండ్లను ఇలా గుర్తించాలి..!

  3. TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)

  4. Weight Loss: బరువు తగ్గాలనే వారికి బెస్ట్ ఫుడ్..!

  5. Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!

  6. Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు