తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

Rythu : రైతుల ఆగ్రహం.. ధాన్యం తగలబెట్టి నిరసన..!

Rythu : రైతుల ఆగ్రహం.. ధాన్యం తగలబెట్టి నిరసన..!

తొర్రూరు, మన సాక్షి :

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కాంటాలు కావడం లేదని లారీలు రావడంలేదని రైతులు రోడేక్కిన సంఘటన, మహబూబాబాద్‌ జిల్లా, తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేక, కాంటాలు లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. మండలంలోని హరిపిరాల, కర్కాల గ్రామాలకు చెందిన రైతులు రెండు ట్రాక్టర్లలో తమ ధాన్యంతో తొర్రూరులోని గాంధీ చౌరస్తాకు చేరుకొని వాహనాల రాకపోకలను అడ్డుకొని,ధాన్యమును నిప్పుతో అంటించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.అదేవిధంగా రైతు సేద్యం పిచ్చయ్య ఆరెకరాల భూమిని ధాన్యం కొనుగోలు కేంద్రంగా మార్చారు కానీ ఇప్పుడు సేద్యం పిచ్చయ్య భూమిని ఖాళీ చేయమని ధాన్యాన్ని ఎక్కడికన్నా తీసుకెళ్లమని హెచ్చరించారని అన్నారు.

అధికారులు, కాంట్రాక్టర్ బాధ్యతలు లేకుండా రైతులను గందరగోళానికి గురిచేస్తున్నారని వాపోయారు. వర్షాలు పడుతున్న సమయంలో ధాన్యం పాడైపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, జిల్లాలో విస్తృతంగా ఉద్యమాలు చేస్తామని రైతులు హెచ్చరించారు.

రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

తొర్రూరు మండలం కర్కాల, హరిపిరాల గ్రామాల్లోని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్నా చేపట్టగా,సన్న వడ్ల కోసం బస్తాలు, లారీల కొరతతో నెలరోజులుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించి, జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో మాట్లాడారు.

ఆయన వెంటనే స్పందించి రెండు లారీలను పంపించారు. ఈ సంధర్బంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ,రైతులు ప్రభుత్వం నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో వైఫల్యం, బోనస్ చెల్లింపులో జాప్యం వంటి సమస్యలతో తీవ్రంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడంలో విఫలమైందని ఎర్రబెల్లి విమర్శించారు.

ప్రభుత్వ తీరుతో రైతులు కన్నీళ్లు మున్నీళ్లు అవుతున్నారని,వెంటనే రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోని పరిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, అశోక్, సతీష్, రాజమల్లారెడ్డి, లక్ష్మయ్య, రాజన్న, రవి, మధుకర్, అనిల్, రాజేందర్, సతీష్, ఎర్రం యాకయ్య, రవీందర్ రెడ్డి, ఎస్కే పాషా, వెంకన్న, ఇస్మాయిల్, బిఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట జిల్లాలో విషాదం.. బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు మృతి..!

  2. Watermelon : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలూ వదలరు..!

  3. Bharat Forge : భారత్ ఫోర్జ్ ఆదాయం రూ.2,163 కోట్లు..!

  4. Hyderabad : జీహెచ్‌ఆర్ లక్ష్మి అర్బన్‌బ్లాక్స్ మరో మైలు రాయి.. ‘ది కాస్కేడ్స్ నియోపోలిస్‌’కు రేరా గ్రీన్ సిగ్నల్..!

  5. Lemon: ఎండిపోయాయని నిమ్మకాయల్ని పడేస్తున్నారా… అయితే మీరు తప్పు చేస్తున్నట్లే..!

మరిన్ని వార్తలు