Health: ఉదయం మీ దినచర్యలో ఇవి ఉంటే.. ఇక మీ ఆరోగ్యం మీ వెంటే..!
Health: ఉదయం మీ దినచర్యలో ఇవి ఉంటే.. ఇక మీ ఆరోగ్యం మీ వెంటే..!
మన సాక్షి :
ఒక వ్యక్తి అలవాట్లే అతడి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన విధానం ముఖ్యం. ప్రధానంగా సోమరితనం వదిలి ఆరోగ్యకరమైన దినచర్య మొదలుపెట్టడం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. నిపుణులు చెబుతున్న ఈ ఉదయపు అలవాట్లు సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి:
నీరు త్రాగడం: ఆరోగ్యవంతులు నిద్ర లేవగానే గోరువెచ్చని నీరు సేవిస్తారు. రాత్రంతా డీహైడ్రేషన్‌కు గురైన శరీరం ఉదయం నీరు తాగడం వల్ల ఉత్తేజితమవుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, విషాన్ని బయటకు పంపుతుంది, రోజుకు మంచి ఆరంభాన్నిస్తుంది.
ధ్యానం లేదా ప్రాణాయామం: ఈ బిజీ జీవితంలో మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యవంతులు ఉదయం కొంత సమయం ధ్యానం లేదా ప్రాణాయామానికి కేటాయిస్తారు. ఇలా చేయడం వల్ల రోజంతా ఒత్తిడి తగ్గుతుంది.
తేలికపాటి వ్యాయామం లేదా యోగా: ఆరోగ్యవంతులు తమ రోజును శారీరక శ్రమతో ప్రారంభిస్తారు. భారీ వ్యాయామాలు అవసరం లేదు. తేలికపాటి వ్యాయామం, సాగదీయడం, పరుగు, యోగా లేదా నడక చేయవచ్చు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యకరమైన అల్పాహారం: ఉదయం అల్పాహారం రోజులో ముఖ్యమైన భోజనం. కనుక, ఉదయం లేవగానే ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉదయం పూట ఓట్స్, పండ్లు, గింజలు, పాలు లేదా పోహా వంటి ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారం తినడం ప్రయోజనకరం.
ఈ అలవాట్లను మీ దినచర్యలో చేర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
By : B.Prashanth, Hyderabad
MOST READ :
-
Bitter guard: కాకరకాయ తింటున్నారా.. పొరపాటున కూడా ఈ ఆహారాలతో కలిపి తినకండి..!
-
Lemon: ఎండిపోయాయని నిమ్మకాయల్ని పడేస్తున్నారా… అయితే మీరు తప్పు చేస్తున్నట్లే..!
-
Rythu : రైతులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. ఇకపై వారికి కూడా ఖాతాలలో డబ్బులు..!
-
Employees : ఆ ఉద్యోగులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం..!
-
Panchayat Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే.. మంత్రి పొంగులేటి క్లారిటీ.. లేటెస్ట్ అప్డేట్..!









