Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District collector : వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్..!

District collector : వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

వర్షాకాలంలో ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ హాల్లో ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి వర్షాకాలం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో రోడ్లు కల్వర్టులు వాటి పటిష్టతపై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఎలాంటి నష్టం రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు వైర్లు తదితర వాటిపై సమీక్షించుకోవాలన్నారు. డిపిఓ గ్రామపంచాయతీ పరిధిలో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

మున్సిపల్ కమిషనర్లు పట్టణంలోని పాత ఇళ్ళను గుర్తించి పుర ప్రజలకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వ్యవసాయ శాఖ సంబంధిత పంటలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఎరువులు యూరియా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

సిపిఓ ఇరిగేషన్ వారు రిపోర్ట్ పంపాలన్నారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ గత సంవత్సరం మద్దూరు మరికల్లో వర్షాలు అధికంగా నమోదు కావడం వల్ల వెంటనే స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందరు అధికారులు అలెర్ట్ గా ఉండాలి, అందరు అధికారులు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి అని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జడ్. పి. సి. ఈ. ఓ.సి. పి. ఓ.ఇరిగేషన్ అధికారులు, పి ఆర్. అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, డిఎంహెచ్వో, డిపిఓ,విద్యుత్ శాఖ,డి ఏ ఓ మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్, ఎ. ఓ. జయసుధ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Gold Price : మళ్లీ కొండెక్కిన బంగారం.. ఒక్కరోజే రూ 24,000..!

  4. TG News : తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4500..!

మరిన్ని వార్తలు