Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsప్రపంచం

Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!

Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!

మన సాక్షి వెబ్ డెస్క్ :

యుగాంతం అనే మాట మనం పుట్టుక ముందు నుంచే వినపడుతుంది. తాత, తండ్రుల నుండి కూడా యుగాంతం అనే మాట వినపడుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి యుగాంతం అనే విషయం తెరపైకి వచ్చింది.

2012లో కూడా యుగాంతం ఉంటుందని చెప్పారు కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడు తాజాగా మరో రెండు రోజుల్లో యుగాంతం జరగబోతుంది అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అసలు నిజం ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మరో రెండు రోజుల్లో యుగాంతం అంటే చాలా మందికి ఫేక్ వార్త అనే అనిపిస్తుంది. కానీ అందులో నిజం కూడా ఉంది. అదేంటంటే.. ఓ భారీ గ్రహశకలం గంటకి 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకు వస్తుంది. ఈ గ్రహశకలం పేరు 2003h4. ఇది 100 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఎంత ఉంటుందో అంత ఉండి.. గంటకి 50 వేల కిలోమీటర్ల వేగంతో భూమి వైపుకు దూసుకొస్తుంది.

ఆ గ్రహశకలం భూమికి చిన్న డాష్ ఇచ్చినా కూడా భూమి మొత్తం నాశనం అవడం ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ సంఘటన జరగడానికి మరి ఎన్నో రోజులు లేదు. కేవలం రెండే రెండు రోజులు.. మే 24వ తేదీ సాయంత్రం 4.07 గంటలకు ఈ గ్రహ శకలం భూమిని ఢీకొనబోతుంది.

అయితే ఈ సంఘటనలో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ గ్రహశకలం గురించి నాసా ఏం చెప్పిందో తెలుసుకుంటే ఇది భూమికి అత్యంత సమీపము నుండి గ్రహశకలం వెళుతుంది. కానీ భూమిని ఢీకొనే ఛాన్స్ మాత్రం తక్కువ అని తేల్చి చెప్పారు. అదే టైంలో ఢీకొన్న కూడా చేసేది ఏమీ లేదని చెప్పారు. ప్రమాదం జరగదని కూడా చెప్పలేమని నాసా చెప్పడంతో చాలామంది ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూమి అత్యంత ప్రకాశంవంతంగా మారుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా 24వ తేదీన అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం.

MOST READ :

మరిన్ని వార్తలు