Narayanpet : విద్యతోనే ప్రగతి సాధించవచ్చు.. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి..!
Narayanpet : విద్యతోనే ప్రగతి సాధించవచ్చు.. ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి..!
నారాయణపేట, మన సాక్షి :
నారాయణపేట జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో తొలిసారిగా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నారాయణపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని అభినందన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ముదిరాజుల అభినందన మరియు సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
మెప నారాయణపేట జిల్లా అధ్యక్షులు రాఘవేందర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి,మెప రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్, రాష్ట్ర ముదిరాజ్ కమీషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్,ముదిరాజ్ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులు నాగరాజు లు హాజరైనరు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి మాట్లాడుతూ విద్యతోనే ప్రగతి సాధించవచ్చు అని పదవ, ఇంటర్ ల లో ఎక్కువ మార్కులు సాధించిన ఇంతమంది విద్యార్థులు రావడం చాలా ఆనందంగా ఉంది అందులో బాలికలు ఎక్కువ మొత్తంలో ఉండటం సన్తిశించదగ్గ విషయమని ముఖ్యంగా బాలికలు ఉన్నత చదువులు చదవాలని మధ్యలో చదువు అపవద్దని దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి.
స్వయంగా నేను డాక్టర్ పిజి కోర్సు చదువుతూ నేను ఇక్కడ ఎమ్మెల్యే గా ఎన్నికవడం జరిగింది ఒక ఎమ్మెల్యే గా నేను ఇంకా చదువు కొనసాగిస్తున్నానని అన్నారు ,నారాయణపేట ప్రాంతంలో ఉన్నత చదువు కునే ఇబ్బందులను మా తాతగారైన చిట్టెం నర్సిరెడ్డి గారు తాను ముందుండి ఇక్కడ డిగ్రీ కళాశాల ను స్థాపించారని అందులో నుండి వేలాదిమంది ఉన్నత చదువులు చదవడానికి దోహదపడింది అని అన్నారు.
డబ్బు మనతో కలకాలం ఉండదు చదువుతో అభివృద్ధి సాధ్యం
– మెప రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్
మెప రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి చదువుకొని ఉన్నతస్థాయి కి చేరుకోవాలని డబ్బులు ఎంత సంపాదించిన అవి స్థిరంగా ఉండవని కానీ చదువు మాత్రం చిరస్థాయిగా మనతోనే ఉంటుంది అని అన్నారు,ముదిరాజ్ లు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరారు.
ముఖ్యమంత్రి పై మాకు నమ్మకముంది
చదువులేక మనం వెనుకబడుతున్నాం
రాష్ట్ర ముదిరాజ్ కమిషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్
బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అందించిన ఈ రాష్ట్ర ప్రభుత్వంపై మాకు ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని బిసి( డి)నుండి బిసి(ఏ)లోకి మారుస్తారన్న నమ్మకం నాకు ఉంది ,మెప వాళ్ళు మన జాతి పిల్లలను సన్మానించడం నాకు చాలా ఆనందంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని వారికి నా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులు సరఫ్ నాగరాజు ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజు లను బిసి డి నుండి బిసి ఏ లోకి మారుస్తామని ఎన్నికల సభ నారాయణపేట లో మాట ఇచ్చారని ఆ మాట నిలబెట్టుకోవాలని దాని అమలుకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సీఎం దృష్టికి తీసుకొని వెళ్లాలని కోరారు అలాగే జిల్లా ముదిరాజ్ సంఘ సమస్యల మెమోరాండం ఎమ్మెల్యే కు అందచేశారు.
ఈ సందర్భంగా ప్రముఖ బంగారు వ్యాపారి సరఫ్ శివకుమార్ ముదిరాజ్ ను ముదిరాజ్ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో ముదిరాజ్ కులానికి చెందిన విద్యార్థులు పదవ తరగతి లో 500 పైగా మార్కులు వచ్చినవారికి,ఇంటర్ లో ప్రథమ సంవత్సరం లో 400 కు పైగా,ద్వితీయ సంవత్సరం లో 900 కు పైగా మార్కులు వచ్చిన సుమారు 400 మంది విద్యార్థులకు గౌరవ సబ్యలచే సన్మానించారు అలాగే నూతనంగా ఉద్యోగాలు సాధించిన వారికి పదోన్నతి పొందిన వారికి అలాగే ఇటీవల డాక్టరేట్ పొందిన కాకర్ల భీమయ్యా ముదిరాజ్ ను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కమిటీ రాష్ట్ర నాయకులు సంజీవ్ ముదిరాజ్, జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు కాంతు కుమార్, ఉపాధ్యక్షులు నర్సిములు నాయుడు,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొనంగెరి హన్మంతు,మెప జిల్లా ప్రధాన కార్యదర్శి రాజకుమార్, గౌరవ అధ్యక్షులు జులు వెంకటేష్, ఉపాధ్యక్షులు పోలేమని గోవింద్, సుగప్ప ముదిరాజ్, దామరగిద్ద సింగిల్ విండో చైర్మన్ ఈదప్ప,ఆకుల బాలప్ప,వకిల్ సంతోష్, వేణుగోపాల్, మిర్చి వెంకటయ్య, కోళ్ల వెంకటేష్,వేణుగోపాల్ టీచర్, కావలి నరహరి,గౌని శ్రీనివాస్ లు మరియు జిల్లా నలుమూలల నుండి ముదిరాజ్ కులపెద్దలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
MOST READ :
-
Rythu : నేల సారం పెంచుకునేందుకు ఇలా చేయాలి.. రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన..!
-
Liver Health: కాలేయ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!
-
Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు లేనట్టేనా..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!
-
Flash.. Flash : నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం..!










