తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లావిద్య

Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!

Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని వైదిక ఉన్నత పాఠశాల 1990-1991 సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలోని శాసనపల్లి రోడ్డులో గల లక్ష్మి బంకేట్ హాలులో ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. 34 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు పాఠశాలలో చదువుకునే రోజులలోని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

పాఠాలు నేర్పిన ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 34 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవడం సంతోషకరమని అన్నారు. గురు శిష్యుల బంధం కుటుంబ బంధం కన్నా మహోన్నతమైనదని అన్నారు.

విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగి సాంఘిక, రాజకీయ, వ్యాపారం, సామాజిక సేవ రంగాలలో సేవ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులుగా రాణించి కష్టాల్లో ఉన్న మిత్రులకు ఆపద్బాంధవులుగా నిలవాలని ఆకాంక్షించారు. అంతకుముందు స్వర్గస్తులైన ఉపాధ్యాయులకు,తోటి విద్యార్థులకు సంతాపం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బుగ్గప్ప, బాల్ రెడ్డి, ఉమా శంకర్, బి వెంకట రాములు, దేవేందర్, నర్సింగరావు, గంగాధర్, సరోజనమ్మ , సుజాత పూర్వ విద్యార్థులు విజయసాగర్, రఘురామయ్యగౌడ్ ,ప్రభాకర్, నాగార్జున రెడ్డి, ఉదయ భాస్కర్, లక్ష్మీకాంత్, సతీష్ గౌడ్, పసుపుల రవి, ప్రకాష్ గౌడ్, రవి ఎక్బోతే, నారాయణ గౌడ్, బసవరాజ్, మల్లికార్జున్, సత్యనారాయణ, ముక్తాదేవి, విజయలక్ష్మి, తేజస్విని, తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Nalgonda : గత జ్ఞాపకాలతో వెల్లువిరిసిన ఆనందం.. ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..!

  2. Miryalaguda : నీట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయ స్థాయి ర్యాంకులు..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!

  4. BREAKING NEWS : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్.. (15-06-2025)

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు.. డేట్ ఫిక్స్.. ఆ రోజు పండుగే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు