Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!

Alumni : 56ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం..!

సూర్యాపేట, మనసాక్షి :

తమతో పాటు చదువుకున్న స్నేహితులను 56 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మళ్లీ కలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1969 హెచ్ ఎస్ సి బ్యాచ్‌ కు చెందిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 56ఏళ్ల తర్వాత పాత మిత్రులంతా ఒక్కచోట కలుసుకోవడంతో గత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

ప్రస్తుతం పరిస్థితుల గురించి, కుటుంబ యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆటపాటలతో రోజంతా సందడిగా గడిపారు. ఈ సందర్భంగానే తమకు చదువు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి సన్మానించారు. వారికి మెమొంటోలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్ రెడ్డి సత్యనారాయణ ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, పూర్వ విద్యార్థులు డాక్టర్ రామరాజు శ్రీనివాస రావు, మాలతి రెడ్డి ,అంజనాదేవి, లీల, ఇందిరా , పొలగాని లక్ష్మీనారాయణ, కిషన్ రావు, ప్రభాకర చారి, భాస్కరరావు, విజయ్ కుమార్, సూర్యనారాయణ ,రామాచారి, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. TG News : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నగరా.. షెడ్యూల్ ఎప్పుడంటే..!

  2. Theft : నడింపల్లెలో భారీగా డబ్బు, బంగారం చోరీ..!

  3. District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

  4. Agriculture : వ్యవసాయ రంగంలో AI టెక్నాలజీ.. రైతులకు ఇక పండుగ..!

  5. District collector : పంచాయతీ కార్యదర్శులకు జిల్లా కలెక్టర్ సీరియస్ వార్నింగ్.. ఆ కేసుల జోలికి వెళ్తే క్రమశిక్షణ చర్యలు..!

మరిన్ని వార్తలు