తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఎరువుల విక్రయంలో అక్రమాలు.. లైసెన్స్ రద్దు, కేసు నమోదు.. అదనపు కలెక్టర్ తనిఖీల్లో వెలుగులోకి..!

Nalgonda : ఎరువుల విక్రయంలో అక్రమాలు.. లైసెన్స్ రద్దు, కేసు నమోదు.. అదనపు కలెక్టర్ తనిఖీల్లో వెలుగులోకి..!

నల్లగొండ, మన సాక్షి :

ఎరువుల ఆమ్మకాలలో అక్రమాలు వెలుగు చూశాయి. జిల్లా అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెళ్లడైంది. దాంతో వెంటనే లైసెన్సు రద్దు చేయడంతో పాటు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, మునుగోడు ఆగ్రో రైతు సేవా కేంద్రం-2 లైసెన్స్ ను తక్షణమే సస్పెండ్ చేయడమే కాకుండా, 6 ఏ కేసు నమోదు చేసినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ తెలిపారు.

బుధవారం రెవెన్యూ అదనపు కలెక్టర్ మునుగోడు లోని ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని -2 ఆకస్మికంగా తనిఖీ చేసి గోదాంలోని ఎరువుల స్టాకును, అమ్మిన ఎరువుల బిల్లులు ఇతర దస్త్రాలు, నిలువ ఉన్న ఎరువుల వివరాలను పరిశీలించారు. అదనపు కలెక్టర్ ఆగ్రో సేవా కేంద్రం-2 తనిఖీ సందర్బంగా 444 బస్తాల యూరియా రాగా, గోడౌన్ స్టాకుకు అమ్మిన స్టాకు కు సుమారు 150 బస్తాల వ్యత్యాసం వచ్చింది.

ఈ వ్యత్యాసానికి గల కారణాలను అదనపు కలెక్టర్ విశ్లేషించగా ఆగ్రో రైతు సేవ కేంద్రం యజమాని వివరాలను సమర్పించలేకపోయారు. దీంతో ఎరువుల అమ్మకం లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను ఎరువుల నియంత్రణ చట్టం ప్రకారం తక్షణమే ఆగ్రో రైతు సేవ కేంద్రం-2 ఎరువుల లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ ప్రకటించారు.

అంతేకాక 6 ఏ కేసు నమోదు చేస్తున్నట్టు వెల్లడించారు. ఎరువుల విషయంలో ఎవరు అక్రమాలకు పాల్పడిన కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మునుగోడు ఆగ్రో రైతు సేవ కేంద్రం-2 ద్వారా వెంటనే ఎరువుల విక్రయాన్ని నిలిపివేయాలని, గోడౌన్ లో ఉన్న ఎరువుల స్టాక్ మొత్తాన్ని సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆయన వెంట చండూర్ ఆర్డీవో శ్రీదేవి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ , మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు వేణుగోపాల్, మండల వ్యవసాయ అధికారిని పద్మజ ఉన్నారు.

MOST READ ; 

  1. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!

  2. Oil Farm : రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఎకరానికి రూ.50 వేల రాయితీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

  3. Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు బంపర్ ఆఫర్.. ప్రభుత్వం తాజా నిర్ణయం..!

  4. Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

మరిన్ని వార్తలు