Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లాహైదరాబాద్

TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!

TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!

మన సాక్షి, హైదరాబాద్ :

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇద్దరు డిఎస్పీలు మృతి చెందారు. ఎదురుగా ఉన్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి స్కార్పియో వాహనం డివైడర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డిఎస్పి చక్రధర్ రావు, డిఎస్పి శాంతారావు గా గుర్తించారు. క్షతగాత్రులు అడిషనల్ ఎస్పీ ప్రసాద్ , డ్రైవర్ నర్సింగ్ రావు లను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని పోలీసులు తరలించారు.

వీరు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. వీకెండ్ కావడంతో హైదరాబాద్ కు వస్తున్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు.

MOST READ : 

  1. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  2. Khammam : ఖమ్మం జిల్లాలో నాటు తుపాకుల కలకలం.. తుపాకులు స్వాధీనం..!

  3. Srisailam : నిండుకుండలా శ్రీశైలం.. నాగార్జునసాగర్ కు భారీ వరద..!

  4. Nalgonda : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు..!

మరిన్ని వార్తలు