Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలు

JAGITYAL : బాల కార్మికులకు విముక్తి..!

JAGITYAL : బాల కార్మికులకు విముక్తి..!

జగిత్యాల, (మన సాక్షి)

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్,ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించి చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా ఈ సంవత్సరం జులై 1 నుండి 31వరకు ఆపరేషన్ ముస్కాన్-XI కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది ఇందులో 36 మంది బాలకార్మికులను గుర్తించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడం జరిగింది.

ఈ సందర్బంగా ఎస్పీ  మాట్లాడుతూ  బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించడం జరుగుతుంది అని అలాగే ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరు అని తెలిపారు.

బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసు శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించారు

MOST READ :

  1. RDO : వైద్యులకు ఆర్డీవో కీలక ఆదేశాలు.. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..!

  2. TG News : ఆధార్ నెంబర్ చెప్తే చాలు.. ఇక రెండు నిమిషాల్లోనే కుల ధ్రువీకరణ పత్రం..!

  3. TG News: ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్.. వారికి భరోసా, భీమా పథకములకు దరఖాస్తు స్వీకరణ..!

  4. Baba Vanga : బాబా వంగా చెప్పింది నిజమే.. 2025లో ఏం జరగబోతోంది..!

మరిన్ని వార్తలు