Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
కరీంనగర్Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణ

District collector : వరద, ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, సిపీ..!

District collector : వరద, ముంపు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, సిపీ..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు తొందరగా ముంపునకు గురవుతున్న జగిత్యాల రోడ్డు, వన్ టౌన్ ఏరియా, నగరంలో ప్రధాన నాళాలు ప్రవహించే ప్రాంతాలను పరిశీలించారు.

వరద నీరు త్వరగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముంపు సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నగరంలో తరచుగా ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పకడ్బందీగా డ్రైనేజీల నిర్మాణం, నాలాల ఎత్తు పెంచడం, అసంపూర్తిగా ఉన్న కల్వర్టులను నిర్మించడం తదితర అంశాలపై చర్చించారు.

వరద నీరు త్వరితగతిన వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని, వాటికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జగిత్యాల రోడ్డులో మంజూరైన ప్రధాన నాళా నిర్మాణాన్ని ప్రారంభించాలని, వన్ టౌన్ వద్దగల నాలా పునర్నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రధాన నాలాలో ఉన్న పూడికను తొలగించాలని ఆదేశించారు.

కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శన

కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి పర్యవేక్షించారు. సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. పోలీస్, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కంట్రోల్ రూమ్ పర్యవేక్షించాలని అన్నారు. కంట్రోల్ రూమ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలియజేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ఇవి కూడా చదవండి

  1. Panchayat Electrons : పంచాయతీ ఎన్నికల పై కీలక అప్డేట్.. వారికి గుడ్ న్యూస్..!

  2. Nalgonda : ఉదృతంగా మూసీ నది.. భీమారం కాజ్వే వద్ద పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  3. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!

  4. Gold Price : బంగారం ధర తగ్గింది.. ఈరోజు ధర ఎంతంటే..!

  5. TG News : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. విద్యా సంస్థలకు సెలవు, ఐటి ఉద్యోగులకు ఇంటి నుంచే పని, వారికి మాత్రం సెలవులు రద్దు..!

మరిన్ని వార్తలు