Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

ACCIDENT : డివైడర్ మధ్య అడ్వర్టైజ్ బోర్డులతో రెండు నిండు ప్రాణాలు బలి..!

ACCIDENT : డివైడర్ మధ్య అడ్వర్టైజ్ బోర్డులతో రెండు నిండు ప్రాణాలు బలి..!

చింతపల్లి, మన సాక్షి :

హైదరాబాదు- నాగార్జునసాగర్ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది.

స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొడకొండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని వీటీ నగర్ గ్రామానికి చెందిన కొడిదూటి నరసింహ (23) , తల్లోజుసందీప్ చారి (22)  ఇరువురు మిత్రులు కలసి (మాల్ ) ఆర్టీసీ బస్టాండ్ నుఁడి మోటార్ బైకు పై పాత మాల్ వై పు వెళ్ళుచుండగా పద్మావతి ఆసుపత్రి సమిపం లో రోడ్డు పై డివైడర్ కు మోటర్ బైక్ బలంగా ఢీ కొట్టడంతో ఇరువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

దీంతో గ్రామస్తులువెంటనే చింతపల్లి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ప్రజలు గాయాల పాలైన ఇరువురి యువకులను లేపి పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలిద్దామనుకోగా అప్పటికే ఇరువురి యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదానికి కారణం రోడ్డు డివైడర్ మధ్య లో అను మతులు లేకుండా ప్రవేట్ అడ్వర్ టైజ్ బోర్డులు ఏర్పాటు చేయడంతో రెండు నిండు ప్రాణాలు బలైనట్లు గ్రామ ప్రజలు ఆవేదన వ్కక్త పరుస్తున్నారు.

దీంతో గ్రామంలో ఇరువురు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామం లో విషాద ఛాయలు నెలకొన్నాయి.అదే రాత్రి చింతపల్లి పోలీసులు మృత్యుబాడీ లనుపోస్ట్ మార్ట్ కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చందిన యువ కుల తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ : 

  1. Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద ప్రవాహం.. అవుట్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!

  2. TATA AIA : భారతదేశపు సూపర్‌ఉమెన్ జీవితాన్ని సంరక్షించేందుకు శుభ్ శక్తిని ఆవిష్కరించిన టాటా ఏఐఏ లైఫ్..!

  3. Godavarikhani : అక్రమ కట్టడాల కూల్చివేత.. భారీగా మోహరించిన పోలీసులు..!

  4. Mosquito : దోమల ద్వారా వచ్చే వ్యాధులేంటో.. ఎప్పుడొస్తాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

  5. Kodada : కోదాడ క్లస్టర్ ఉద్యాన విస్తరణ అధికారిగా ముత్యంరాజు.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు