Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ర్యాగింగ్ కు పాల్పడితే.. ఏం జరుగుతదంటే..!

Suryapet : ర్యాగింగ్ కు పాల్పడితే.. ఏం జరుగుతదంటే..!

సూర్యాపేట, మనసాక్షి :

విద్యాసంస్థల్లో రాగింగ్‌ చేసే విద్యార్థులపై చట్టపరంగా చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని జిల్లా ఎస్పీ కే నరసింహ ఒక ప్రకటన లో హెచ్చరించారు.. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో రాగింగ్‌ ఒక తీవ్రమైన నేరమని పేర్కొన్నారు.

ర్యాగింగ్‌ కు పాల్పడితే కాలేజీ నుండి బహిష్కరణకు గురవుతారని,క్రిమినల్ కేసులు నమోదై వారి విద్య, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాల పైన ప్రభవిత చూపుతాయని అన్నారు.. ప్రతి ఉన్నత విద్యాసంస్థలో యాంటీ రాగింగ్ కమిటీలు, స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని, కొత్త విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవగాహన కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిరంతరంగా నిర్వహించే లా విద్యాసంస్థలు చర్యలు తీసుకోవాలని అన్నారు.

అన్ని ప్రాంతాలలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. విద్యార్థులు సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, అనుచిత ప్రవర్తనలు చేయకూడదని సూచించారు. రాగింగ్ ఘటనలు ఎదురైతే బాధితులు తక్షణమే ప్రిన్సిపాల్, కళాశాల యాజమాన్యం లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు.

పిర్యాదు చేయడంతోనే ర్యాగింగ్ ను అరికట్టవచ్చు అన్నారు. ర్యాగింగ్ సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు కలిసి రాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేయాలని కోరారు.

MOST READ : 

  1. Murder : వీడిన సహస్ర హత్య మిస్టరీ.. అసలు ఎందుకు హత్య చేశాడో తెలుసా..!

  2. Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

  3. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

  4. Gold Price : బాబోయ్.. గోల్డ్ ధర ఒక్కరోజే రూ.10,900.. ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు