Karimnagar : అత్యాచారం కేసులో సంచలన విషయాలు..!

Karimnagar : అత్యాచారం కేసులో సంచలన విషయాలు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ పట్టణంలోని శ్రీ దీపిక హాస్పిటల్లో ఓ యువతీపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనరెట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. పక్క జిల్లాకు సంబందించిన ఓ యువతీ జ్వరంతో బాధపడుతూ.. తన తల్లిదండ్రులతో కలసి చికిత్స కోసం కరీంనగర్ లోని శ్రీ దీపిక హాస్పిటల్లో ఈ నెల 6న అడ్మిట్ అయినట్లు పోలీసులు తెలిపారు.
హాస్పిటల్లో కాంపౌండర్ (ఓటీ టెక్నీషియన్) గా విధులు నిర్వహిస్తున్న మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన పెద్ది దక్షన్ మూర్తి అలియాస్ దక్షిణామూర్తి అనే వ్యక్తి, రాత్రి డ్యూటీలో ఉన్న సమయంలో పేషెంట్ దురుద్దేశంతో మరియు ఆసక్తి వాంఛలను తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో బాధితురాలికి మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి, ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో నిర్దారించారు.
విచారణలో భాగంగా హాస్పిటల్‌కు వెళ్లి విచారించి, కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్‌ను స్వాదీనం చేసుకుని, మూడవ పట్టణ టౌన్ పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేసి పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు మహారాష్ట్రలోని సిరోంచలో ఇంటర్మీడియట్ (బైపిసి) వరకు చదివి, సుమారు నాలుగు సంవత్సరాల క్రితం కరీంనగర్‌కు వచ్చి ఆసుపత్రులలో ఉద్యోగానికై ప్రయత్నాలు ప్రారంబించినట్లు తెలిపారు.
మొదట ఓ ప్రయివేట్ హాస్పిటల్లో వార్డ్ బాయ్ గా ఒక సంవత్సరం పనిచేశాడని పేర్కొన్నారు. ఆ తర్వాత వేరే హాస్పిటల్లో మేల్ స్టాఫ్ నర్సుగా పని చేసినట్లు తెలిపారు. అయితే, తరచూ మద్యం సేవించి డ్యూటీకి హాజరు కావడం, అశ్రద్ధ ప్రవర్తన కారణంగా ఆ ఆసుపత్రి యాజమాన్యం అతడిని తొలగించినట్లు పేర్కొన్నారు. తరువాత స్వగ్రామంలో గడిపి తిరిగి కరీంనగర్ వచ్చి శ్రీ దీపిక హాస్పిటల్లో కాంపౌండర్ (ఓటీ టెక్నీషియన్) గా పని చేస్తూ ఆదర్శనగర్‌లో నివాసముంటున్నట్లు తెలిపారు. నిందితుడు తరచూ అశ్లీల వెబ్సైట్లను చూసేవాడని, మద్యం మత్తులో విధులకు హాజరయ్యేవాడని తెలిపారు.
హాస్పిటల్ యాజమాన్యం అనుసరిస్తున్న నియమాలు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం ఉన్నచో సంబంధిత అధికారుల నివేదిక పంపి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో నిందితుడు చెడు అలవాట్లకు బానిసై, ఉన్మాదిగా మారి ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు బానిసలై, తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
MOST READ :
-
District collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!
-
Gold Price : గోల్డ్ ఆల్ టైమ్ రికార్డ్.. ఈరోజు తులం ఎంతో తెలిస్తే షాక్..!
-
District collector : ఇందిరమ్మ గృహ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన..!
-
Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!
-
District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!









