Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్వ్యవసాయం

Bonus : బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని రోడ్ ఎక్కిన రైతన్నలు..!

Bonus : బోనస్ డబ్బులు వెంటనే ఇవ్వాలని రోడ్ ఎక్కిన రైతన్నలు..!

కోటగిరి, మన సాక్షి :

బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని ఉమ్మడి మండలాల రైతులు కోటగిరి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… గత రబ్బి సీజన్లో బోనస్ చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు.

రైతులు పండించిన సన్న వడ్ల పై 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి రైతులను మభ్యపెడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయకపోతే కలెక్టర్ కార్యాలయని ముట్టడించి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం సేకరణ వెంటనే ప్రారంభించి, రైస్ మిల్లర్లు మూడు నుంచి ఐదు కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని అన్నారు.

తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి మరియు బోనస్ డబ్బులు ఇవ్వాలని రైతులు కోరారు.ఈ ఖరీఫ్ సీజన్ లో అకాల వర్షాల కుంభవృష్టి కారణంగా ధాన్యం దిగుబడులు సరిగా లేనందువలన ఇట్టి చెల్లింపులతో రైతులకు సహాయంగా ఉంటుందని అన్నారు. అనంతరం తాసిల్దార్ గంగాధర్ వచ్చి రైతులతో మాట్లాడారు.

రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. అనంతరం తాసిల్దార్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో వల్లేపల్లి శ్రీనివాస్ రావు,తెల్ల రవికుమార్, ఏమూల నవీన్, మోరే కిషన్ పుల్లల మోహన్ రావు, సుధం నవీన్, శంకర్ కాపుగండ్ల శ్రీనివాస్, సాయి శ్రీకాంత్, గంగ ప్రసాద్ గౌడ్, రమేష్, అరవింద్, ఫారూఖ్, ఉమ్మడి మండలాల రైతులు పాల్గొన్నారు.

MOST READ :

  1. వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!

  2. Kissing : ముద్దు పెట్టుకుంటే ఇన్ని లాభాలా.. తెలుసుకోవల్సిందే..!

  3. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

  4. Garlic : వెల్లుల్లి తింటే కలిగే అద్భుత ఆరోగ్య లాభాలు.. ఏ సమయంలో తినాలో తెలుసా..! 

మరిన్ని వార్తలు