District collector : వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. అలా చేస్తే చర్యలు..!

District collector : వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. అలా చేస్తే చర్యలు..!
కరీంనగర్, మనసాక్షి :
ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పనితీరు మెరుగు పరుచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి.. వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్ సీల వారీగా ప్రసవాలు, ఎన్ఆర్సీ రిపోర్ట్, ఆరోగ్య మహిళ, ఎన్ సీడీ రిపోర్ట్ , డెంగీ కేసులు, శుక్రవారం సభ, టీబీ కేసులు, వ్యాక్సినేషన్, ఓపీ, ఐపీ కేసుల వివరాలను వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎంత మందికి స్క్రీనింగ్ నిర్వహించారు.. హైపర్ టెన్షన్, డయాబెటిస్ కేసుల వివరాలు, ప్రైవేటు నుంచి ప్రభుత్వాసుపత్రులకు ఎంతమంది వచ్చారో తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో ఇమ్యునైజేషన్ పూర్తి కాకపోవడం, ప్రసవాల సంఖ్య తగ్గడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఓపి,ఐపీ సేవలు పెంచితే ప్రసవాలు పెరుగుతాయని పేర్కొన్నారు. గర్భిణీగా నిర్ధారణ అయినప్పటి నుంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ సాధారణ ప్రసవం జరిగేలా కౌన్సెలింగ్ చేయాలన్నారు. వారి రిజిస్ట్రేషన్లు, వైద్య పరీక్షలు, సకాలంలో పూర్తి చేయాలన్నారు.
ప్రతివారం ఆశాలు, ఏఎన్ఎంలు వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి అన్ని వివరాల డేటా నమోదు చేయించాలని మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. నిక్షయ్ పోర్టల్ లో టీవీ వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేయిస్తే ప్రభుత్వ సాయం అందుతుందని పేర్కొన్నారు.
ప్రతి పీహెచ్సీలో జరిగిన ప్రసవాలు, వైద్యం పొందిన రోగుల సంఖ్యతో నోటీసు బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు రాయవద్దని వైద్య అధికారులకు సూచించారు. అంతకుముందు మాతామరణాలపై సమీక్ష నిర్వహించగా మెడికల్ ఆఫీసర్లు, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్లు తప్పనిసరిగా ఎంసీపీ కార్డుపై, కేసు షీట్ పై సంతకాలు చేసి కేసు వివరాలు రాయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటరమణ, పీఓ సనా, పీహెచ్ సీ వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Medicine : ప్రభుత్వ దవాఖానాలో గడువు ముగిసిన మందుల పంపిణీ.. వైద్య సిబ్బందిపై ప్రజల ఆగ్రహం..!
-
District collector : భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!
-
TG News : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, లంచ్..!
-
Gold Price : బంగారం ధర తగ్గుతుందా.. ఈరోజు తులం ఎంతంటే..!









