TOP STORIESBreaking Newsతెలంగాణనల్గొండవ్యవసాయం

Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి, అన్నదాతలకు తీవ్ర నష్టం..!

Miryalaguda : అకాల వర్షం.. నేలపాలైన వరి, అన్నదాతలకు తీవ్ర నష్టం..!

మిర్యాలగూడ/ వేములపల్లి, మన సాక్షి :

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో నేల పాలయింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని పంట పొలాలు ఈదురుగాలికి పూర్తిగా దెబ్బతిన్నాయి. చేతికి అందిన పంట వర్షాలతో నేలకొరకడంతో ఏ రైతులు మందలించిన కన్నీళ్లే మిగిలాయి.

వానాకాలం పంటల పై రైతుల్లో గుబులు నెలకొంది.సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రకృతి సహకరించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతుల్లో మరింత గుబులు నెలకొంది.ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని.. పుట్టెడు పెట్టుబడులు పెట్టి కండ్లల్లో ఒత్తులు వేసుకొని పంటలు కాపాడుకుంటూ వస్తున్న రైతులకు వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ఇప్పటికే ముందస్తుగా నాటు బెట్టిన పంటపొలాలను రైతులు కోత మిషన్ల సహాయంతో పంటను కోసి మిల్లులకు తరలిస్తున్నారు. మరికొన్ని పంట పొలాలు పొట్ట దశలో ఉండగా ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలకు చేతికందే దశలో ఉన్న పంట పొలాలు నేలకు ఒరుగుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మండలంలోని శెట్టిపాలెం, రావులపెంట, మొలకపట్నం, కామేపల్లిగూడెం, లక్ష్మీదేవిగూడెం, ఆమనగల్ తదితర గ్రామాల్లోని పంట నష్టం తీవ్రంగా వాటిల్లింది. ఎలాంటి జీవనాధారం లేని వారు వ్యవసాయం పై మక్కువతో కౌలు రైతులుగా మారుతున్నారు.

గ్రామాల్లోనే వ్యవసాయ భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి కౌలు రైతులకు కన్నీళ్లు, అప్పులు తప్ప ఏమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కౌలు రైతులకు కన్నీళ్లు మిగిల్చింది.ప్రస్తుతం పంట లను చూస్తుంటే కౌలు రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటట్లు లేదు.

MOST READ :

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి..!

  2. Miryalaguda : భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేల పాలైన వరి..!

  3. Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!

  4. Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

  5. Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!

మరిన్ని వార్తలు