Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : తడిసిన ధాన్యంపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

District collector : తడిసిన ధాన్యంపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు..!

సూర్యాపేట, మనసాక్షి :

భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా తడిసిన ధాన్యం ఉంటే వెంటనే నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ వి సి ఛాంబర్ లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ మొంధా తుఫాన్ వల్ల జిల్లాలో అధిక వర్షాలు కురుస్తాయని అధికారులను, రైతులను అప్రమత్తం చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాశులపై టార్పాలిన్ పట్టాలు కప్పటం వల్ల ఎక్కువగా ధాన్యం తడవలేదని అడుగు భాగాన గాని, చివరి అంచుల్లో గాని తడిస్తే వెంటనే మిల్లులకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కొనుగోలు కేంద్రాలను మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ఒక ప్రత్యేక అధికారిని ఇంచార్జిగా నియమించాలని అవసరం ఉన్న చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్ లో నిలువ చేసుకోవాలని, ప్రతి రోజు సాయంత్రం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యంపై నివేదిక తప్పని సరిగా సమర్పించాలని ఆదేశించారు.

తడిసిన ధాన్యం పై అలాగే ఎక్కడైనా ధాన్యం కొట్టుకుపోయిన వెంటనే తమకు తెలియజేయాలని ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో 24 గంటల పాటు 6281492368 నెంబర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎవరికైనా ధాన్యం కొనుగోలు, వర్షం వల్ల ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఫిర్యాదు చేస్తే తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అదనపు కలెక్టర్ కె సీతారామారావు మాట్లాడుతూ పంచాయతి సెక్రటరీ,గ్రామపాలనాధికారి అలాగే సీసీలలో ఒక్కరిని ప్రతి కొనుగోలు కేంద్రానికి ఇన్చార్జిగా నియమించి వారిని ఆ కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టే విధంగా చూడాలని తహసిల్దార్లను ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జెడ్పి సీఈవో వి వి అప్పారావు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డిపిఓ యాదగిరి, ఆర్ అండ్ బి ఈఈ సీతారామయ్య, పంచాయతీ రాజ్ ఈఈ లు వెంకటయ్య, మాధవి, ఇరిగేషన్ ఎస్సీ శివ ధర్మ,డిఎస్ఓ మోహన్ బాబు,డిఎం రాము, డి సి ఓ పద్మ, రవాణా అధికారి జయప్రకాష్ రెడ్డి,అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి , డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్, సిపిఓ కిషన్, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి తదితరులు హాజరయ్యారు.

MOST READ : 

  1. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన యాదాద్రి దేవస్థానం ఇంజనీర్..!

  2. Heavy Rain : స్ట్రక్చర్ సహాయంతో నిండు గర్భిణిని వాగు దాటించిన 108 సిబ్బంది.. (వీడియో)

  3. Wines Tenders : ఒకే ఒక్క టెండర్ వేశాడు.. చనిపోయాడు.. డ్రా లో అతడికే దక్కిన షాప్.. ఎవరికి కేటాయిస్తారు..!

  4. Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వేలో భారీ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు..!

మరిన్ని వార్తలు