IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!

IBOMMA : ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్.. నిర్వాహకుడి అరెస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఐ బొమ్మ ప్రేక్షకులకు బిగ్ షాక్ తగిలింది. నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు అయ్యారు. శనివారం ఉదయం కూకట్పల్లిలోని సిసిఎస్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవి పోలీసులు పక్కా సమాచారంతో అతని అరెస్టు చేశారు.
ఇన్ని సంవత్సరాలుగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. కాగా సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే పేరు ఐ బొమ్మ. ఓటిపి లు నెట్ఫ్లిక్స్, అమెజాన్ , జియో హాట్ స్టార్ సినిమాలను నిమిషాల వ్యవధిలోనే పైరసీ చేసి ఐ బొమ్మ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు.
ఇటీవల ఐ బొమ్మ ఆగడాలు మితిమీరాయి. సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే ఐ బొమ్మలో ప్లే చేస్తున్నారు. దాంతో సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల కాలంలో పైరసీ చేస్తున్న వారిని పోలీసులు పెద్ద ఎత్తున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఐ బొమ్మ నిర్వాహకుడు పోలీసులకే సవాలు చేసిన విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
MOST READ :
-
ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!
-
Miryalaguda : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం.. మిర్యాలగూడలో సంబరాలు..!
-
TG News : రైతులకు అతి భారీ గుడ్ న్యూస్.. ఎకరానికి రూ.50,918 సబ్సిడీ.. మీరు పొందండి..!
-
TG News : జూబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ముగిసిన ఐదు రౌండ్లు..!









