Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!

RRR : త్రిబుల్ ఆర్ కు భూములు ఇచ్చేది లేదు.. పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన రైతులు..!

అందోలు, మన సాక్షి:

ట్రిపుల్ ఆర్ రోడ్డు కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చౌటకూర్ మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ట్రిపుల్ ఆర్ కు సంబంధించి అవసరమైన భూ సేకరణకుగాను చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామములో నోటీసులు అందజేయడానికి వెళ్లిన ఆర్ ఐ ప్రమోద్, జిపిటీ ప్రవీణ్ లను రైతులు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గంట సేపు నిర్బంధించారు.

దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎకరాకు రూ.16 లక్షలు చెల్లించేందుకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినట్లు అధికారులు చెప్పగానే రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎకరా భూమి రూ.కోటి పలుకుతుంటే రూ.16 లక్షలు ఇస్తామంటే ఒప్పుకోమని, భూమి కి భూమి లేదా రూ.కోటి రూపాయలు ఇస్తేనే నోటీసులు తీసుకుంటామని రైతులు తెలుపగ అది మా ఫరిది కాదని తెలపడంతో ఆగ్రహించిన రైతులు అధికారులను బలవంతంగా పంచాయతీ కార్యాలయంలోకి లాక్కెళ్లి బంధించారు.

విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనీల్ కుమార్ పోలీసు సిబ్బందితో శివంపేటకు చేరుకొని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు సీఐతో రైతులు వాగ్వివాదానికి దిగారు. తాను ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీఐ సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఎట్టి పరిస్థితుల్లోను రూ.16 లక్షలకు విలువైన భూములు ఇచ్చేది లేదని ఖరాఖండిగా రైతులు తెలిపారు.

MOST READ ; 

  1. District collector : జిల్లా కలెక్టర్ సాహసం.. ఓ మహిళ ధరఖాస్తుకు స్పందించి చెంచువాని తండాలో పర్యటన..!

  2. Khammam : ఖమ్మంలో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త.. కూతురుపై కూడా..!

  3. TG News : కేటీఆర్ కు బిగ్ షాక్.. ఫార్ములా ఈ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి..!

  4. TG News : కారుకు సైడ్ ఇవ్వలేదని తండ్రి వయసున్న ఆర్టీసీ డ్రైవర్ పై కాలితో తన్ని దాడి.. (వీడియో వైరల్)

మరిన్ని వార్తలు