Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : NPL -6 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..!

Nalgonda : NPL -6 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..!

నల్లగొండ, మనసాక్షి :

నల్లగొండ ప్రతిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలతో పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల గ్రౌండ్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో కలిసి ఎన్ పీఎల్ -6 (నల్లగొండ ప్రీమియర్ లీగ్) క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్సీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఇందులో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు ఐపీఎల్ లాంటి టోర్నమెంట్ లో పాల్గొనడానికి అవకాశం లభిస్తుందన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంతో పాటు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అభివృద్ధిలో నల్లగొండ మినీ హైదరాబాద్ ల ముందుకు పోతుందని తెలిపారు.

ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి టోర్నమెంటును నిర్వహించడం పట్ల ఆర్గనైజర్స్ ను అభినందించారు. నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిమాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభిస్తుందన్నారు.

టోర్నమెంట్ తో 20 రోజులపాటు క్రీడాభిమానులకు పండగ అన్నారు.
ఈ పోటీలలో గెలుపొందిన ప్రధమ విజేతకు రూ.2,22,222, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1,11,111 నగదు బహుమతిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు మీదుగా అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ బోనగిరి ప్రభాకర్, ముత్తినేని నాగేశ్వరరావు, పాలకూరి శ్రీధర్, సుదరగోని రమేష్, సయ్యద్ అనష్, సముద్రాల శంకర్, పోగుల సాయి, నాళ్ళ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

MOST READ : 

  1. High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!

  2. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

  3. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!

  4. AP News : హోరాహోరీగా బండ లాగుడు పోటీలు..!

మరిన్ని వార్తలు