Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : యాద్గార్ పల్లిలో ప్రచారం ప్రారంభం..!

Miryalaguda : యాద్గార్ పల్లిలో ప్రచారం ప్రారంభం..!

మిర్యాలగూడ, మనసాక్షి:

మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామంలో సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి బ్యాట్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేయాలని యాద్గార్ పళ్లి గ్రామంలో తొలిరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించటం జరిగింది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ యాదగిరి పల్లి గ్రామంలో హరిజనవాడలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయించినారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐదు ఎకరాల స్థలములో 150 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారన్నారు.

ఇప్పుడు 80 ఇందిరమ్మ ఇండ్లు గ్రామానికి వచ్చాయని, రేషన్ కార్డులు వచ్చినాయని, సన్న బియ్యం కూడా వస్తున్నాయన్నారు. సిపిఐ, సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జొన్నలగడ్డ శ్రీనివాస్ రెడ్డి బ్యాట్ గుర్తు, మిత్రపక్షల అభ్యర్థులు 12 వార్డులలో 12 మంది అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అప్పన బోయిన వెంకటయ్య, కన్నే కంటి రామకృష్ణ, వస్కుల గోపి, ముడుసు పుల్లయ్య, బంటు రామస్వామి, బంటు రామచంద్రు, కొండేటి సోమరాజు, దేవరకొండ చంద్రమౌళి, ఎడ్ల సురేష్, వస్కుల సురేష్, లింగంపల్లి నరసింహ, పరమేష్, రాములు, జనార్ధన్, సైదులు, సైదమ్మ, నాగమణి, ఎల్లమ్మ, పున్నమ్మ, రేణుక, భద్రమ్మ, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Sarpanch Elections : పంచాయతీ బరిలో యువత..!

  2. CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. దేవరకొండకు అండగా ఉంటా..!

  3. ACB : రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అదనపు కలెక్టర్..!

  4. CM Revanth Reddy : ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియా.. సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

మరిన్ని వార్తలు