Breaking Newsక్రీడలుజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
Narayanpet : శిశు మందిర్ లో జిల్లా స్థాయి ఖేల్ ఖూద్ పోటీలు..!

Narayanpet : శిశు మందిర్ లో జిల్లా స్థాయి ఖేల్ ఖూద్ పోటీలు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
నారాయణపేట మండలం కోటకొండ శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయి ఖేల్ కూద్ పోటీలను నిర్వహించారు.పోటీలను పాఠశాల అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సరస్వతి శిశు మందిరాలు సంస్కృతితో కూడిన విద్య అందిస్తూ విద్యార్థుల దేహ దారుఢ్యం,మానసిక వికాసం కోసం ఖేల్ ఖుద్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇక్కడ పోటీల్లో గెలిచిన విద్యార్థులు కల్వకుర్తి లో ఈ నెల 26,27 తేదీల్లో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి కెంచె శ్రీనివాసులు, విభాగ్ కార్యదర్శి కుంటి ఎల్లప్ప వివిధ పాఠశాలల ప్రధాన చార్యులు, జిల్లా పరిషత్ హై స్కూల్ పి. ఇ. టి రమణ , 50 మంది ఆచార్య మాతాజీలు 486 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
MOST READ









