TOP STORIESviralతెలంగాణ
వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!
వేపచెట్టు నుండి పాలధార నిర్విరామంగా స్రవిస్తోంది. ఈ విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది.

వేపచెట్టు కొమ్మల నుంచి బుసబుస శబ్దం.. తీరా చూస్తే విచిత్ర దృశ్యం..!
మేళ్లచెరువు, మనసాక్షి:
వేపచెట్టు నుండి పాలధార నిర్విరామంగా స్రవిస్తోంది. ఈ విచిత్ర సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగింది. మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ ఇస్లావత్ బాలాజీ ఇంట్లో ఉన్న వేప చెట్టు నుండి రెండు రోజులుగా వేపచెట్టు నుండి ఈ పాలధార ఉబికి వస్తోంది.
చెట్టు కొమ్మకు గల రంధ్రం నుండి బుసబుసమనే శబ్దం తో పాల లాంటి ఈ ద్రవం కారుతోంది. ఆరేళ్లుగా అద్దెకు ఇదే ఇంట్లో ఉండి, ఆ తర్వాత అదే ఇల్లు కొన్నామని బాలాజీ తెలిపాడు. ఇల్లు కొన్నప్పుడు చెట్టు చిన్నగా ఉండేదని ఇప్పుడు 30 అడుగుల ఎత్తుకు పెరిగి పెద్దదైనట్లు చెప్పాడు.
ఈ వింత ఘటన ఏంటో మాకు అర్ధం కాలేదని చెప్పాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం లో వేప చెట్టుకు పాలు కారతాయని విన్నానని, ఇప్పుడు చూసి ఆశ్చర్య పోయానని బాలాజీ చెప్పాడు.









