Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Vemulapally : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ..!
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ నారబోయిన సతీష్ అన్నారు.

Vemulapally : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ..!
వేములపల్లి, మన సాక్షి :
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మహిళలకు ఇందిరమ్మ ఇండ్ల సొంతింటి కల నెరవేరుతుందని సర్పంచ్ నారబోయిన సతీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని సల్కునూరు గ్రామంలోని లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాచమల్ల చిన్న సైదులు, పంచాయతీ కార్యదర్శి దివ్య, పాలకవర్గం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










