Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణవిద్యసూర్యాపేట జిల్లా

Alumni : 35 ఏళ్ల నిరీక్షణకు తెర.. సూర్యాపేటలో మిత్రుల జ్ఞాపకాల హరివిల్లు..!

కాలం వెనక్కి వెళ్ళింది.. ముప్పై ఐదేళ్ల నాటి జ్ఞాపకాలు మళ్ళీ చిగురించాయి. ఒకప్పుడు బడి బ్యాగులతో అల్లరి చేసిన ఆ చిచ్చరపిడుగులు, ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడి, జుట్టు నెరిసినా మనసు మాత్రం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయింది.

Alumni : 35 ఏళ్ల నిరీక్షణకు తెర.. సూర్యాపేటలో మిత్రుల జ్ఞాపకాల హరివిల్లు..!

సూర్యాపేట, మనసాక్షి :

కాలం వెనక్కి వెళ్ళింది.. ముప్పై ఐదేళ్ల నాటి జ్ఞాపకాలు మళ్ళీ చిగురించాయి. ఒకప్పుడు బడి బ్యాగులతో అల్లరి చేసిన ఆ చిచ్చరపిడుగులు, ఇప్పుడు సమాజంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడి, జుట్టు నెరిసినా మనసు మాత్రం మళ్ళీ బాల్యంలోకి వెళ్ళిపోయింది. సూర్యాపేట పట్టణంలోని శిరీష విద్యానికేతన్ హైస్కూల్ 1990-91 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక విజయ్ బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కనులపండువగా సాగింది.

ఖండంతరాల గ్యాప్‌ను చెరిపేసిన స్నేహం
ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు శ్రీనివాస్. వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడిన ఆయన, కేవలం తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలనే తపనతో ఏడు సముద్రాలు దాటి సూర్యాపేట చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

“దేశం ఏదైనా, హోదా ఏదైనా.. నా స్నేహితుల మధ్య నేను మళ్ళీ ఆనాటి 10వ తరగతి శ్రీనునే” అని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. వివిధ ప్రాంతాల్లో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా సెటిల్ అయిన మిత్రులంతా ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

నాడు తరగతి గదిలో చేసిన అల్లరి..శిరీష స్కూల్ గ్రౌండ్‌లో ఆడిన ఆటలు..గురువులు చెప్పిన పాఠాలు..ఇలా ప్రతి విషయాన్ని నెమరువేసుకుంటూ విజయ్ బ్యాంకెట్ హాల్ ప్రాంగణాన్ని నవ్వులతో ముంచెత్తారు.
35 ఏళ్ల తర్వాత మళ్ళీ అందరినీ ఇలా చూడటం ఒక వరంలా అనిపిస్తోంది.

ఈ రోజు మేమందరం మా వృత్తులను, హోదాలను పక్కన పెట్టి మళ్ళీ విద్యార్థులుగా మారిపోయాము,” అని పలువురు మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యాఖ్యాతల ఆటపాటలు, సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలతో సందడి నెలకొంది.

మధ్యాహ్నం విందు భోజనం అనంతరం ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా మిత్రుల కష్టం సుఖాల్లో తోడుండాలని ప్రతిన బూనారు. ఈ అపూర్వ కలయికను ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అందరూ ధన్యవాదాలు తెలిపారు.

MOST READ 

  1. BREAKING : దేవరకొండ – నల్గొండ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు..!

  2. అత్యంత వైభవంగా ‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల..!

  3. BIG BREAKING : 8 మంది మావోయిస్టుల లొంగుబాటు..! 

  4. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

మరిన్ని వార్తలు