Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Municipal Elections : రెండు గంటల్లో నల్గొండ జిల్లాలో 17% పోలింగ్.. మిర్యాలగూడలో పదివేల ఓట్లు పోల్..!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17% పోలింగ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

Municipal Elections : రెండు గంటల్లో నల్గొండ జిల్లాలో 17% పోలింగ్.. మిర్యాలగూడలో పదివేల ఓట్లు పోల్..!
నల్గొండ/మిర్యాలగూడ, మన సాక్షి :
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 17% పోలింగ్ అయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 17 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 17 శాతం ఓటర్లు ఓట్లు వేశారు.
అదే విధంగా మిర్యాలగూడ మున్సిపాలిటీలో 9 గంటల వరకు 11.16% పోలింగ్ అయ్యింది. మిర్యాలగూడలో మొత్తం 93,020 ఓట్లకు గాను10,383 ఓట్లు పోలయ్యాయి. మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంట నారాయణ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు స్వాగతం పలుకుతూ అధికారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
MOST READ
-
MUNICIPAL ELECTIONS : తెలంగాణలో మున్సిపల్ పోలింగ్ ప్రారంభం.. పట్టణాల్లో హై అలర్ట్..!
-
Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం.. ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు తప్పనిసరి..!
-
Vemulapally : రావులపెంటలో కోతుల బెడద..!
-
Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!









