Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
నల్గొండBreaking Newsజిల్లా వార్తలు

Vemulapally : రావులపెంటలో కోతుల బెడద..!

కోతుల బెడదతో కాలనీ ప్రజలకు తీవ్ర భయాందోళన వెంటాడుతుంది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుంది.

Vemulapally : రావులపెంటలో కోతుల బెడద..!

వేములపల్లి, మన సాక్షి:

కోతుల బెడదతో కాలనీ ప్రజలకు తీవ్ర భయాందోళన వెంటాడుతుంది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలోని ఎస్సీ కాలనీలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతుంది. కోతులు విపరీతమై గుంపులు గుంపులుగా సంచరిస్తూ..ప్రజలను బెదిరిస్తూ గాయపరుస్తూ హడలెత్తిస్తున్నాయి.  ఇంటి తలుపులు తెరుచుంటే చాలు లోనికి ప్రవేశించి, నిత్యవసర సరుకులు, పప్పులు, కూరగాయలు తీసుకువెళ్లడమే కాకుండా పిల్లలు, వృద్ధుల పై దాడులకు పాల్పడుతున్నాయి.

కోతుల సంఖ్య పెరగడంతో కాలనీ ప్రజలు ఇంటి తలుపులు మూసి వేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఇటీవల ఇద్దరు రైతులపై కోతులు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.కోతుల నివారణకు చర్యలు చేపట్టాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు.

కోతుల సమస్యను త్వరగా పరిష్కరిస్తాం :  సందరబోయిన చంద్రయ్య, సర్పంచ్

కోతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం..గత కొంతకాలంగా కోతుల బెడద విపరీతంగా ఉన్నది..ఒకటి,రెండు రోజుల్లో వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తాం.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ పై ఎగిరే జెండా.. అభివృద్ధే ఎజెండా, గెలుపెవరిది..!

  2. TG News : తెలంగాణలో సర్పంచులకు మరో కీలక అధికారాలు..!

  3. Nalgonda : సాగర్ ఎడమ కాలువలో కారు గల్లంతుకు ప్రధాన కారణం.. ఆ చిన్న పొరపాటే, అలా ఎవరు చేయొద్దు..!

  4. Municipal Elections : మున్సిపల్ బిగ్ ఫైట్.. మిర్యాలగూడలో కింగ్ మేకర్ ఎవరు..!

మరిన్ని వార్తలు