Nalgonda : అక్రమంగా ధాన్యం విక్రయించిన మిల్లర్లు.. నల్గొండ జిల్లాలో ఇద్దరు అరెస్ట్, పరారీలో ఐదుగురు మిల్లర్లు..!
ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నిందితు లైన రైస్ మిల్ యజమానులను బుధవారం నల్లగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు శరత్ చంద్ర పవర్ తెలిపారు.

Nalgonda : అక్రమంగా ధాన్యం విక్రయించిన మిల్లర్లు.. నల్గొండ జిల్లాలో ఇద్దరు అరెస్ట్, పరారీలో ఐదుగురు మిల్లర్లు..!
నల్లగొండ, మన సాక్షి.
ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల మేర నష్టం కలిగించిన ప్రధాన నిందితు లైన రైస్ మిల్ యజమానులను బుధవారం నల్లగొండ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. బుధవారం ఎస్పీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కేసును తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్నల్గొండ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు నమోదు చేయడం జరిగిందని తెలిపారు .
కె.శివరాం రెడ్డి, డి.ఎస్.పి నల్గొండ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టి, బుధవారం ఉదయం 11:00 గంటలకు నల్గొండ మండలంలోని దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. నల్గొండ పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీకి చెందిన కందుకూరి మహేందర్, కందుకూరి పద్మ ను అరెస్టు చేయగా, మాశెట్టి రాధా కృష్ణ, మేడమ్ కృష్ణమూర్తి, ఇడుకుళ్ళ దామోదర్, కందుకూరి రవి కుమార్,.బూరుగు బాలకృష్ణ లు పరార్ లో ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి
నగదు – రూ.1,09,000/-మూడు సెల్ ఫోన్లు బెలెనో కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
నిందితులు 2022-23 రబీ సీజన్‌లో నిందితులు నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలలోని సుమాంజలి పార్ బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ – ఆర్జాలబావి, నల్గొండ. వరలక్ష్మి పార్ బాయిల్డ్ మిల్ – చిట్యాల మనోహర ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – మునుగోడు ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరిలో కందుకూరి మహేందర్ ప్రధాన పాత్రధారిగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ ఏజెంట్/మర్చంట్‌గా రైతుల నుండి కనీస మద్దతు ధర ఎం ఎస్ పి కింద ఐకెపి, పిఎసిఎస్ డీఏవో, ఎండిసిఎంఎస్, ఎఫ్ పి ఓ ల ద్వారా కొనుగోలు చేసిన ప్యాడీకి సరిపడా బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా, కుట్రపూరితంగా ధాన్యాన్ని అక్రమంగా విక్రయించారని ఎస్పీ తెలిపారు.
ఈ మూడు రైస్ మిల్లుల ద్వారా మొత్తం 13,170.061 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు రూ.43 కోట్ల నష్టం కలిగించినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు. వీటిలో సుమాంజలి మిల్ – సుమారు రూ.22 కోట్ల నష్టంవరలక్ష్మి మిల్ – సుమారు రూ.19.33 కోట్ల నష్టం, మనోహర మిల్ – సుమారు రూ.1.47 కోట్ల నష్టం చేశారని ఈ కేసులో నిందితులు నేరపూరిత నమ్మక ద్రోహానికి పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్లు విచారణలో తెలిపగా వీరిపై నల్గొండ రూరల్, చిట్యాల, మునుగోడు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేసి రిమాండు పంపమన్నారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ కేసును నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తులో పాల్గొన్న నల్గొండ II టౌన్ సీఐ రాఘవరావు, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు,నల్గొండ రూరల్ ఎస్. ఐ సైదాబాబు, మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
MOST READ
- Shankarpally : శంకర్పల్లి మున్సిపల్ చైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్ బాధ్యతలు స్వీకారం..!
- PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. చెల్లింపులు మరింత ఈజీ.. లేటెస్ట్ అప్డేట్..!
- Indiramma Houses : రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం..!
- Indiramma Houses : రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం..!









