TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. ఈరోజే చివరి తేదీ, అలా చేయకుంటే పథకాలు, రాయితీలు అందవు..!

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం రైతులకు తప్పనిసరి చేసిన గుర్తింపు కార్డు కోసం ఫార్మర్ రిజిస్ట్రీ శనివారం చివరి తేదీగా ప్రకటించింది. విశిష్ట రైతు గుర్తింపు నమోదుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. శనివారం సాయంత్రంలోగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేయాలి.

Big Alert : రైతులకు బిగ్ అలర్ట్.. ఈరోజే చివరి తేదీ, అలా చేయకుంటే పథకాలు, రాయితీలు అందవు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్. కేంద్ర ప్రభుత్వం రైతులకు తప్పనిసరి చేసిన గుర్తింపు కార్డు కోసం ఫార్మర్ రిజిస్ట్రీ శనివారం చివరి తేదీగా ప్రకటించింది. విశిష్ట రైతు గుర్తింపు నమోదుకు ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. శనివారం సాయంత్రంలోగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీని పూర్తి చేయాలి. లేకపోతే వ్యవసాయ సంబంధిత సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు, రాయితీలు ఎలాంటివి అందవని అధికారులు పేర్కొంటున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే రైతుల సంక్షేమ పథకాల కోసం తప్పనిసరిగా ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఉండాలని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రైతులు 90 శాతం పైగా పూర్తి చేసుకున్నారు. కానీ మిగిలినవారు రైతులు కూడా ఈరోజు సాయంత్రంలోగా చేసుకుంటే వారికి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబర్ ఉంటుంది. దీని ద్వారా ఒక రైతుకు రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నా సరే ఓకే నెంబర్ 11 అంకెల ఆధారంగా వివరాలు ఆన్‌లైన్ లో నమోదు అవుతాయి.

రైతులకు సంబంధించిన యూనిక్ ఐడి అనేది భవిష్యత్తులో అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న పెట్టుబడి సహాయంతో పాటు అన్నదాత సుఖీభవ, పంటల నష్టపరిహారం, రైతుల బీమా, బ్యాంకుల నుంచి 0 వడ్డీకి రుణాలు.. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే రైతుల సంక్షేమ పథకాలన్నీ ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటేనే అమలు కానున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు