Miryalaguda : కరెంటు మీటర్ రీడర్స్ కు 30 రోజుల పని కల్పించాలి..!
నెలలో 30 రోజులపాటు పని కల్పించాలని కోరుతూ మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ మీటర్ రీడర్స్ పీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులు విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్, రాష్ట్ర నాయకులకు వినతిపత్రం అందజేశారు.

Miryalaguda : కరెంటు మీటర్ రీడర్స్ కు 30 రోజుల పని కల్పించాలి..!
మిర్యాలగూడ, మన సాక్షి:
నెలలో 30 రోజులపాటు పని కల్పించాలని కోరుతూ మిర్యాలగూడ డివిజన్ విద్యుత్ మీటర్ రీడర్స్ పీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులు విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం డివిజన్, రాష్ట్ర నాయకులకు వినతిపత్రం అందజేశారు.
విద్యుత్ బిసి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాచకొండ వెంకన్న, సీతారాములు మాట్లాడుతూ రాష్ట్రంలో మీటర్ రీడర్స్ గా గత 15 సంవత్సరాల పై నుండి విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీసుకుంటూ లైన్మెన్ ల కింద పనులు చేసుకుంటూ ప్రాణాలు పణంగా పెట్టి స్తంభాలు ఎక్కి పూర్తి బాధ్యతతో పనులు చేస్తున్నారన్నారు. విద్యుత్ యజమాన్యం వీరిని గుర్తించి మీటర్ రీడింగ్ తోపాటు 30 రోజుల పని దినాలు కల్పించాలన్నారు.
మీటర్ రీడర్స్ 2వ తారీకు నుండి కరెంటు మీటర్ల రీడింగ్ లు తీయడం బందు చేస్తూ హైదరాబాదులో ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు పాల్పడుతున్న కార్మికులకు వెంటనే న్యాయపరమైన విధులను అప్పగించాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ బిసి సంఘ నాయకులు కోచం మారయ్య, కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ మీటర్ రీడర్స్ యూనియన్స్ నాయకులు మునీర్, శ్రీకాంత్, సైదా, అజయ్ నాయక్, మనసురాలి, కోటేష్, నాగార్జున, కరుణాకర్ రెడ్డి, శ్రీను, వినోద్ కుమార్, రాము, మహేష్, నాగరాజు, ప్రశాంతు, శశిధర్, మేష నాయక్, మల్లేష్, కొంపెల్లి సైదులు పాల్గొన్నారు.