Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో సైబీరియన్ అందాలు.. 30 ఏళ్లుగా ఆతిథ్యం ఇస్తున్న కొత్తగూడెం చెరువు..!

రష్యాలోని సైబీరియన్ కొంగలు సూర్యాపేట జిల్లాకు వలస పక్షులుగా చేరుతున్నాయి. ప్రతి ఏటా శీతాకాలం సమయంలో వలసలు వస్తుంటాయి.

Suryapet : సూర్యాపేట జిల్లాలో సైబీరియన్ అందాలు.. 30 ఏళ్లుగా ఆతిథ్యం ఇస్తున్న కొత్తగూడెం చెరువు..!

రష్యాలోని సైబీరియన్ కొంగలు సూర్యాపేట జిల్లాకు వలస పక్షులుగా చేరుతున్నాయి. ప్రతి ఏటా శీతాకాలం సమయంలో వలసలు వస్తుంటాయి. అదేవిధంగా ఈ ఏడాది కూడా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలోని చెరువుకు సైబీరియన్ కొంగలు వచ్చాయి. అంతో ఆ గ్రామం అందచందాలతో కలకలలాడుతుంది.

గత 30 సంవత్సరాలుగా కొత్తగూడెం చెరువుకు సైబీరియన్ కొంగలు ప్రతి ఏటా వచ్చి వెళ్తుంటాయి. దాంతో ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రజల నమ్మకం. సైబీరియన్ కొంగలు రావడం వల్ల వడగాలులు, వడగళ్ల వర్షాలు కూడా పడవని ఇక్కడి రైతులు నమ్ముతున్నారు. జూన్ మాసంలో తిరిగి ఈ వలస పక్షులు వెళుతుంటాయి. ఈ పక్షులను చూసేందుకు గ్రామస్తులు ప్రతిరోజు చెరువు సమీపం కు వచ్చి వెళ్తుంటారు.

గ్రామ సర్పంచ్ రవి, హైదరాబాద్ కు చెందిన పక్షి ప్రేమికుడు మహేష్ మాట్లాడుతూ కొత్తగూడెం గ్రామంలో పర్యావరణం చాలా చక్కగా ఉందని, సైబీరియన్ నుంచి కొంగలు ప్రతి ఏటా వలస రావడం మంచిదని పేర్కొంటున్నారు. మా గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ పేర్కొంటున్నారు. సైబీరియా నుంచి వలస కొంగలు రావడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

By : Subhash, Thungathurthy

MOST READ : 

మరిన్ని వార్తలు