Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవిద్య

TG : వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రైతులకు కూలీల ఖర్చు తగ్గించడమే లక్ష్యంతో పాటు ఆధునీకరణ సాగును ప్రోత్సహించడానికి భారీ సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

TG : వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం.. రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవం తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రైతులకు కూలీల ఖర్చు తగ్గించడమే లక్ష్యంతో పాటు ఆధునీకరణ సాగును ప్రోత్సహించడానికి భారీ సబ్సిడీతో వ్యవసాయ డ్రోన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యాచరణ వెల్లడించారు. రైతులు పంట పొలాలకు పురుగు మందులను పిచికారి చేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు.

అందుకు చిన్న సన్నకారు రైతులు డ్రోన్లను వినియోగించాలంటే ఖర్చుతో కూడుకున్న పనిగా మారింది. అయితే ప్రభుత్వం ఒక్కొక్క డ్రోన్ కు 40 శాతం సబ్సిడీ లేదా గరిష్టంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ ప్రభుత్వం నిర్ణయంతో సన్న చిన్న కారు రైతులు ఎస్సీ, ఎస్టీలు, మహిళా రైతులకు ఈ పథకంలో ప్రాధాన్యత కల్పించనున్నారు. తొలివిడతగా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు 10 డ్రోన్ల చొప్పున పంపిణీ చేయనున్నారు. వీటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు కేటాయిస్తారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఈ పథకం కు సంబంధించి రైతులు అర్హతలు సబ్సిడీ శాతం దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే 10 నుండి 15 రోజులలో మిగిలిన వ్యవసాయ పరికరాలు కూడా రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఆధునీకరణ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం లాభసాటిగా చేసి రైతులకు మేలు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించుకుంది.

డ్రోన్ల వల్ల రైతులకు లాభమా..?

వ్యవసాయంలో డ్రోన్ల ద్వారా పురుగు మందులను పిచికారి చేస్తున్నారు. ఈ డ్రోన్ల సహాయంతో పురుగు మందులు పిచికారి చేయడంతో సమయం ఆదా అవుతుంది. కూలీల కొరత తీరుతుంది. దాంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుంది. పురుగు మందులు కూడా పంటచేను అంతా సమానంగా అందుతాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు