Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Vemulapally : ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు..!

వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది.

Vemulapally : ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు..!

వేములపల్లి, మన సాక్షి:

వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం మిర్యాలగూడ పట్టణం సుందర్ నగర్ కాలనీకి చెందిన మర్రి రవి (45) జలీల్, సతీష్ , లు మండల కేంద్రంలోని ఎడమ కాలువలో స్నానం చేయడానికి వచ్చారు.

స్నానం చేస్తుండగా.. నీటి ప్రవాహ వేగానికి ప్రమాదవశాత్తు రవి , సతీష్ కాలువలో గల్లంతైనట్టు స్థానికులు పేర్కొన్నారు. సతీష్ మృతిదేహం గరిడేపల్లి మండలం పొనుగోడు సమీపంలో లభించినట్టు తెలిసింది. రవి ఆచూకీ లభ్యం కాలేదు. రవి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుంటూ దర్యాప్తు చేపట్టిన పోలీసులు గల్లంతైన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిసింది. స్నానానికి ముందు మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు